రోజూ ఒక జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 11, 2024, 3:19 PM IST

జామకాయ ఒక సీజనల్ కాయ. దీన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే మరీ కచ్చివి కాకుండా.. కొంచెం పండిని జామ పండును రోజూ ఒకటి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

guava

పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే డాక్టర్లు కానీ, ఆరోగ్య నిపుణులు కానీ వీటిని రెగ్యులర్ గా తినాలని చెప్తుంటారు. ఇలాంటి వాటిలో జామకాయ ఒకటి. 

జామకాయ ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు దీనిలో ఎన్నో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జామకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

ఇవి పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి. అలాగే గర్భధారణ సమయంలో శిశువు సరైన అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని రోజూ ఒకటి తినడం వల్ల ఎన్నో లాభాలను పొందుతాము. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


విటమిన్ సి

ఎన్నో రకాల సిట్రస్ పండ్ల కంటే జామకాయలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. దీంతో మీరు ఎన్నో రోగాలకు, అంటువ్యాధులకు దూరంగా ఉంటారు. రోజూ ఒక జామకాయను తింటే మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గాయాలు త్వరగా మానుతాయి. 

యాంటీమైక్రోబయల్ లక్షణాలు

జామకాయలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే జామకాయ బ్యాక్టీరియా, వైరస్ల నుంచి మనల్ని రక్షించడానికి సహాయపడుతుంది. జామకాయను తింటే రోగాలు, సంక్రమణ నుంచి మీరు సేఫ్ గా ఉంటారు. 

ఫైబర్ ఎక్కువగా ఉంటుంది

జామకాయలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్దకం సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అంతేకాదు ఇది మీ గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్

జామకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ ఒక జామకాయను తింటే మీ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తటస్థం అవుతాయి. ఇది మిమ్మల్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడుతుంది. 

రక్తంలో చక్కెర నియంత్రణ

కొన్ని పరిశోధనల ప్రాకారం.. జామకాయ, దాని ఆకులు మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుందని కనుగొన్నారు. 

గుండె ఆరోగ్యం

జామపండులో పొటాషియం కూడా ఉంటుంది. అంటే ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందన్న మాట. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ ఒక జామకాయను తింటే మీకు గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
 

బరువు తగ్గడం

బరువు తగ్గాలనుకునేవారికి కూడా జామకాయ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే జామకాయను తిన్న వెంటనే మీ కడుపు తొందరగా నిండుతుంది. ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జామపండులో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

చర్మ ఆరోగ్యం

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మెండుగా ఉండే జామకాయను తింటే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం.. రోజూ ఒక జామకాయను తింటే మీ చర్మంపై ముడతలు, గీతలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. అలాగే జామకాయ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. దీన్ని తింటే మలబద్దకం నుంచి బయటపడతారు. 

click me!