ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా అసవరం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అల్పాహారం అస్సలు మిస్ చేయకూడదు. అలా అని ఏదిపడితే అది తినడం కూడా అంత మంచిదేమీ కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది సింపుల్ గా అయిపోతుంది కదా.. అని ప్రతిరోజూ ఉదయాన్నే అరటిపండ్లు, బ్రెడ్, కోడిగుడ్డు.. ఇదే రోజూ తింటూ ఉంటారు. కానీ ఇదే మెనూ రోజూ తీసుకోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రెడ్‌లో అధిక పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉంటుంది, ఇది శరీరానికి చాలా హానికరం. రుచికరమైన బ్రెడ్ తెలియకుండానే శరీరానికి ఎంత ప్రమాదం కలిగిస్తుందో మీకు తెలిస్తే, మీరు ఈ రోజు నుండి అల్పాహారం జాబితా నుండి దీనిని తీసేస్తారు.
ఈ మధ్యకాలంలో చాలామంది అల్పాహారం కింద బ్రెడ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. దీనిని ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది.
అల్పాహారం అంటే బటర్ టోస్ట్, శాండ్‌విచ్‌లు, ఫ్రెంచ్ టోస్ట్. అన్నట్లుగా మారిపోయింది.
బ్రెడ్‌లో అధిక పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ ఉంటుంది, ఇది శరీరానికి చాలా హానికరం. ఇది చాలా ప్రమాదం కూడా.
బ్రెడ్ తయారుచేసేటప్పుడు అనేక రకాల పోషకాలను తొలగిస్తారు. నిజానికి దానిని తయారు చేసే పిండికి ఒక రుచి ఉంటుంది అది ఉంటే, బ్రెడ్ అస్సలు రుచికరంగా ఉండదు. ఆ దుర్వాసనను నివారించడానికి వివిధ రుచులను కలుపుతారు, అందుకే ఆరోగ్యానికి హానికరం.
వైట్ బ్రెడ్ ని బ్లీచింగ్ చేస్తారు. ఇది శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ బ్రడ్ తినడం వల్ల ఎసిడిటీ బాగా పెరుగుతుంది.
ప్రతిరోజూ బ్రెడ్ తినడం వల్ల కార్బన్ డయాక్సైడ్, బ్రోమిన్ వంటి విష పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది భయంకరమైన వ్యాధులకు దారితీస్తుంది.
రొట్టెలో ఎక్కువ ఉప్పు మరియు సోడియం శరీరానికి చాలా నష్టం కలిగిస్తాయి మరియు రొట్టెలో ని షుగర్ కారణంగా బరువు ఎక్కువగా పెరుగుతారు.