ఉల్లిపాయపై నల్ల మచ్చలు, తినొచ్చా, తినకూడదా?

First Published | Nov 21, 2024, 5:01 PM IST

మనం ఉల్లిపాయలు కొన్నప్పుడు వాటిపై నల్లగా దుమ్ములాంటి మచ్చలు ఉండటం మీరు గమనించే ఉంటారు? అలా ఉన్న ఉల్లిపాయలన మీరు తినొచ్చా? తింటే ఏదైనా ప్రమాదం ఉందా?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఈ సామేత మీరుు వినే ఉంటారు. మన వంటకు ఉల్లిపాయ  చాలా ముఖ్యమైనది. భారతీయులందరూ ఉల్లిని రెగ్యులర్ గా వాడుతూనే ఉంటారు. మనం వండుకునే కూరలకు ఉప్పు, కారం, పప్పు ఎంత కీలకమో.. ఉల్లిపాయ కూడా అంతే ముఖ్యం. వంటకు రుచి తేవడంలో దీనిది కీలక పాత్ర అనే చెప్పొచ్చు. ఉల్లిధర చాలా ఎక్కువ పెరిగిపోయినప్పుడు కూడా ఉల్లి కొంటూనే ఉంటాం. ఎందుకంటే ఏది వండాలన్నా ఉల్లి ఉండాల్సిందే.

ఉల్లిపాయ మన  వంటకు రుచిని మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలు చేకూరుస్తుంది.  రక్తంలో షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం దగ్గర నుంచి, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎముకలు ధృఢంగా చేయడానికి, ఆరోగ్యకరమైన గుండెకు కూడా సహాయం చేస్తుంది.

Latest Videos


అయితే.. మనం ఉల్లిపాయ తొక్క తీసినప్పుడు ఒక్కోసారి వాటిపై మనకు నల్లమచ్చలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని పట్టుకుంటే.. మన చేతికి కూడా అంటుకుంటుంది. దీనిని శిలీంధ్రం అని పిలుస్తారు.

నల్ల మచ్చలు ఆస్పర్‌గిల్లస్ నైగర్ అనే శిలీంధ్రం వల్ల వస్తాయి. ఇది మట్టిలో, ఉల్లిపాయలో కనిపిస్తుంది. మరి.. ఇలా ఉన్న ఉల్లిపాయలను మనం తినొచ్చా? ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం కలుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

నిపుణుల ప్రకారం నల్లగా  శిలీంధ్రం ఉన్న ఉల్లిపాయలు తినకపోవడమే మంచిది. అలెర్జీలు ఉన్నవారు ఈ ఉల్లిపాయలు అస్సలు తినకూడదు. ఎందుకంటే. వాటి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

ముఖ్యంగా  ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఉల్లిపాయలు తినకూడదు. దీని వల్ల హాని ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఉల్లిపాయలో నల్ల మచ్చలు ఉంటే, రెండు పొరలు తీసేయండి. శిలీంధ్రం ఒకటి రెండు పొరల్లోనే ఉంటుంది.

ఉల్లిపాయతో పాటు బ్లాక్ ఫంగస్ కనిపిస్తే, వెంటనే పడేయండి. వాడకండి. వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మంచిగా ఉన్న ఉల్లిపాయలను మాత్రమే తీసుకోవడం మంచిది.

click me!