ఈ ఐదు చట్నీలు తింటే ఈజీగా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా?

First Published | Nov 21, 2024, 11:46 AM IST

పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలి అంటే.. మనం మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని చట్నీలు తినడం వల్ల  ఈజీగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?

weight loss

ఈ రోజుల్లో బరువు పెరగడం చాలా ఈజీ. నచ్చిన ఫుడ్స్  ముఖ్యంగా జంక్ ఫుడ్ తినేస్తే మనకు తెలీకంుడానే బరువు పెరిగిపోతాం. కానీ.. ఆ పెరిగిపోయిన బరువును తగ్గించుకోవడానికి మాత్రం చాలా తిప్పలు పడాల్సి ఉంటుంది. బరువు తగ్గాలని  నిర్ణయం తీసుకున్నవారు  ఐస్ క్రీమ్స్, స్వీట్స్, పిజ్జా , బర్గర్ లాంటి ఫుడ్స్ తినడం మానేయాలి. ఇవి అదనంగా బరువు పెరగకుండా మాత్రమే ఆపగలవు. మరి, పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలి అంటే.. మనం మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని చట్నీలు తినడం వల్ల  ఈజీగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?

మనమందరం ఉదయం లేవగానే వేడి వేడిగా ఇడ్లీ , దోశ లాంటి బ్రేక్ ఫాస్ట్ లను తినడానికి ఇష్టపడతాం. ఇక.. అవి తినాలంటే. కాంబినేషన్ చట్నీ ఉండాల్సిందే. మరి.. ఆ చట్నీలు రుచిగా ఉండటంతో పాటు..  మన అధిక బరువును కూడా తగ్గిస్తాయంటే మీరు నమ్ముతారా? మరి, ఆ చట్నీలు ఏంటి? ఎలా తయారు చేయాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం…


chutney

1.పుదీనా చట్నీ…

 దక్షిణాదిన ఎక్కువ మంది ఇష్టంగా తినే చట్నీలలో పుదీనా చట్నీ కూడా ఒకటి. కానీ.. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది దీనిని తినడమే మానేశారు. కానీ… దీనిని మీరు రెగ్యులర్ గా మళ్లీ తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. పుదీనా చట్నీలో కొత్తిమీర కూడా చేర్చుకోవచ్చు. ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీ అధిక బరువును అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

2.టమాట చట్నీ..

టొమాటోలో 95% నీరు ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. తక్కువ కేలరీలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. టొమాటోలు వాటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టొమాటో చట్నీ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. మన స్థానిక స్టైల్‌లో టొమాటో చట్నీ చేసి రుచి చూడండి.

దోసకాయ చట్నీ

టొమాటోల్లాగే, దోసకాయలలో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువ. దోసకాయ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. గట్ ఆరోగ్యం, జీవక్రియను ప్రోత్సహిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కరివేపాకు, మిరపకాయలు, జీలకర్ర ఆవాలు వేసి దక్షిణ భారత శైలిలో దోసకాయ చట్నీని సిద్ధం చేయండి. రుచి బాగుంటుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

వేరుశెనగ చట్నీ

వేరుశెనగలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది మీకు ఆకలి వేసే అవకాశం తక్కువ. పల్లీలు మీ శరీరంలో శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఉత్తర భారతదేశంలో, పెరుగులో వేరుశెనగలను కలిపి చట్నీ తయారుచేస్తారు. మా స్వంత చట్నీ తయారు చేయడం ద్వారా మీరు బరువు తగ్గవచ్చు.

మామిడికాయ పచ్చడి

బరువు తగ్గడానికి మామిడిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నా పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది మరియు జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఒక్కసారి మామిడికాయ చట్నీ చేస్తే చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది.

Latest Videos

click me!