Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత తినకూడనివి ఇవే..!

Published : Mar 07, 2025, 03:44 PM IST

వేసవిలో పుచ్చకాయ అందరూ తింటారు. అయితే.. పుచ్చకాయ తిన్న తర్వాత మాత్రం కొన్ని ఫుడ్స్ అస్సలు తినకూడదట. అవేంటో చూద్దాం..

PREV
13
Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత తినకూడనివి ఇవే..!

ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. ఆ వేడిని తట్టుకోవడానికి అందరూ పుచ్చకాయ తింటూ ఉంటారు.  ఈ సీజన్ లో బాడీ డీ హైడ్రేట్ అవుతుంది.. అదే పుచ్చకాయ తింటే ఆ సమస్య ఉండదు. ఎందుకంటే.. పుచ్చకాయ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరాని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు.. కూల్ గా కూడా ఉంచుతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది.

అయితే.. ఈ పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలు తినకూడదట. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. మరి.. వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

23
పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగితే మంచిది కాదు

పాల పదార్థాలు 

పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. పుచ్చకాయ తిన్న తర్వాత పాల పదార్థాలు కలిస్తే వాపు వస్తుంది. జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే, పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉండాలి.

33
పుచ్చకాయ తిన్న వెంటనే ప్రొటీన్ ఫుడ్స్ తినకూడదు

ప్రొటీన్ ఫుడ్స్

పుచ్చకాయ తిన్న తర్వాత ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం మంచిది కాదు. జీర్ణ ఎంజైమ్ లను దెబ్బతీస్తుంది. పప్పులు, పన్నీర్, కోడి గుడ్డు లాంటివి తినకూడదు.

గుడ్డు

పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు తినకూడదు. రెండూ కలిపి తింటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వస్తాయి.  

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే పుచ్చకాయ తినండి. తిన్న తర్వాత గుడ్డు, ప్రొటీన్ ఫుడ్స్, పాల పదార్థాలు తినకండి.

click me!

Recommended Stories