ఈ ఒక్క పండుతో ఫాస్ట్ గా బరువు తగ్గుతారు

Published : Jan 23, 2025, 03:45 PM IST

డ్రాగన్ ఫ్రూట్ ను ఎక్కువ మంది తినరు. ఎందుకంటే ఈ పండు రుచి అంతగా బాగోదు. కానీ ఈ పండును తింటే మాత్రం మీరు ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
16
 ఈ ఒక్క పండుతో ఫాస్ట్ గా బరువు తగ్గుతారు
Dragon Fruit

చలికాలంలో పండ్లను ఎంత ఎక్కువ తింటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే పండ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ రెండు మూడు రకాల పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. పండ్లు, కూరగాయలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఈ పండ్లు, కూరగాయలు మనం ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. వీటిలో డ్రాగన్ ఫ్రూట్  ఒకటి. 

26
Dragon Fruit

డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ అంత బాగుండదు. అందుకే చాలా మంది ఈ పండును తినరు. కానీ ఇది మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. దీనిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని ఆరోగ్యకరమైన పండు అని అంటారు. ఈ పండును గనుక మీ డైట్ లో చేరిస్తే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

36
Dragon Fruit


డ్రాగన్ ఫ్రూట్ ను తింటే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయినా చాలా మంది ఈ పండును తినడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఈ పండు మనకు చేసే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఈ పండును తినకుండా అస్సలు ఉండలేరు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు. అసలు డ్రాగన్ ఫ్రూట్ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బరువు తగ్గడానికి డ్రాగన్ ఫ్రూట్ ఎలా సహాయపడుతుంది?

తక్కువ కేలరీలు, పిండి పదార్థాలు

డ్రాగన్ ఫ్రూట్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పిండి పదార్థాలు కూడా తక్కువగా ఉంటాయి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అందుకే బరువు తగ్గడానికి డ్రాగన్ ఫ్రూట్ గొప్ప పండని అంటారు. ఈ పండులో ఉండే వాటర్, ఫైబర్ కంటెంట్ వల్ల మీరు సులువుగా, ఫాస్ట్ గా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

46
Dragon Fruit

D


ఎక్కువ ఫైబర్ కంటెంట్

డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ కడుపును తొందరగా నింపి మీరు హెవీగా తినకుండా చేస్తుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీకు తెలుసా?డ్రాగన్ ఫ్రూట్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

జర్నల్ ఆఫ్ కరెంట్ రీసెర్చ్ అండ్ ఫుడ్ సైన్స్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న హై ఫైబర్ కంటెంట్ ప్రీ-బయోటిక్ గా పనిచేస్తుంది. దీనిలో ఒక రకమైన కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. దీంతో మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది. 
 

56

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

డ్రాగన్ ఫ్రూట్ డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో మంచిది. ఎందుకంటే ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది రక్త ప్రవాహంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండును తిన్న వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. అలాగే రక్తంలో చక్కెర నెమ్మదిగా, స్థిరంగా విడుదల అవుతుంది.షుగర్ వ్యాధి ఉన్నవారికి ఈ పండు చేసే మేలు ఎంతో.

 

66
Dragon Fruit

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది

డ్రాగన్ ఫ్రూట్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండును తింటే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే మీరు హెల్తీగా బరువు కూడా తగ్గుతారు. మీరు డ్రాగన్ ఫ్రూట్ ను మీ రోజువారి ఆహారంలో చేర్చితే మీ శరీరం ఆర్ద్రీకరణను నిర్వహించడానికి సహాయపడుతుంది. ది ఫార్మా ఇన్నోవేషన్ జర్నల్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. డ్రాగన్ ఫ్రూట్ ను తింటే మీరు తగ్గాలనుకుంటున్న బరువును సులువుగా తగ్గుతారు. అలాగే మీ ఇమ్యనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

శరీర కొవ్వును తగ్గిస్తుంది

డ్రాగన్ ఫ్రూట్ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రకారం.. డ్రాగన్ ఫ్రూట్ లో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో ఉన్న అనారోగ్యకరమైన కొవ్వును తగ్గిస్తుంది. ఇది మీరు  ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

click me!

Recommended Stories