రోజుకు రెండు సార్లు అన్నం తిన్నా ఏమౌతుందో తెలుసా?

First Published | Jan 10, 2025, 4:17 PM IST

రోజుకు రెండు సార్లు కాదు మూడు నాలుగు సార్లు కూడా అన్నాన్ని తినేవారున్నారు. కానీ మీరు రోజుకు రెండు సార్లు అన్నం తిన్నా ఏం జరుగుతుందో తెలుసా?

మన దేశంలో రైసే ప్రధాన ఆహారం. అందుకే చాలా మంది రోజుకు మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అన్నం తినడం వల్ల మన కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలాగే శరీరం శక్తివంతంగా ఉంటుంది. అందుకే చాలా మంది ప్రతిరోజూ అన్నాన్ని తింటుంటారు. 

అయితే కొంతమంది రోజుకు మూడు పూటల కాకుండా రెండు పూటలా తింటుంటారు. అంటే ఉదయం ఇడ్లీ, దోష లాంటి ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ ను చేసేసి మధ్యాహ్నం, రాత్రి పూట మాత్రం కడుపు నిండా అన్నాన్ని తింటుంటారు. కానీ రోజులో రెండు సార్లు అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటారు. ఇలా ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 



రోజుకు రెండు సార్లు అన్నం తింటే ఏమౌతుంది?

రక్తంలో చక్కెర పెరుగుతుంది

అసలు డయాబెటీస్ ఉన్నవారు అన్నం తినకపోవడమే మంచిది. ఎందుకంటే వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు అన్నాన్ని తినకూడదంటారు. అంతేకాదు రోజుకు రెండు పూటలా అన్నాన్ని తింటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

బరువు పెరుగుతారు
 
బరువు తగ్గాలనుకునేవారు, బరువును మెయింటైన్ చేయాలనుకునేవారు రోజుకు రెండు పూటలా అన్నాన్ని తినకపోవడమే మంచిది. ఎందుకంటే అన్నంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు గనుక రోజుకు రెండు సార్లు అన్నాన్ని తింటే మీరు బరువు పెరిగిపోతారు. ఊబకాయం మరింత పెరుగుతుంది. అందుకే దీనికి బదులుగా హెల్తీ ఫుడ్స్ ను తినాలంటారు.

గుండె జబ్బులు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుండె జబ్బులున్న వారు కూడా అన్నం ఎక్కువగా తినకూడదు. నిపుణుల ప్రకారం.. అన్నం ఎక్కువగా తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. కానీ దీనిపై స్పష్టమైన అధ్యయనాలు ఏమీ లేవు.

జీర్ణ సమస్యలు

అన్నం కడుపు నిండా తింటే జీర్ణ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే బియ్యంలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇవే జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. 

పోషకాహార లోపం

అన్నాన్ని ఎక్కువగా తినేవారిలో పోషకాల లోపం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అన్నంలో పోషకాలు పెద్దగా ఉండవు. వీరు ఇతర ఆహారాలను కూడా తినరు. దీంతో వీరి శరీరంలో ప్రోటీన్లు. విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు లోపంచే అవకాశం ఉంది. దీనివల్ల వీరికి లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

మరేం చెయ్యాలి?

మీరు గనుక రోజుకు రెండు పూటలా అన్నాన్నే తింటుంటే మీ రోజువారి ఆహారంలో ధాన్యాలను, కూరగాయలను, పండ్లను చేర్చండి. ఇవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పోషక లోపాలను పోగొడుతాయి. అలాగే హెల్తీగా కూడా ఉంటారు. 

Latest Videos

click me!