బాబా రామ్ దేవ్ ఆహార ఆరోగ్యంపై సలహాలు ఇస్తూన్నారనే విషయం తెలిసిందే. అందులో మనం తీసుకునే ఆహారంలో అనుసరించే కొన్ని తప్పుడు చర్యల గురించి హెచ్చరించారు. అదేవిధంగా, సరైన ఆహారం ఏమిటో కూడా సరిగ్గా చెప్పారు. ఇప్పుడు ఊబకాయం అనేది విశ్వవ్యాప్త సమస్య. దీని వల్ల జరిగే నష్టం తక్కువేమీ కాదు. ఊబకాయం మధుమేహం, కొలెస్ట్రాల్, స్ట్రోక్ , వంధ్యత్వం వంటి వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. బాబా రామ్‌దేవ్ ఈ ఊబకాయానికి చాలా నివారణలు సూచిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పలు ఆయుర్వేద చికిత్సలను ప్రస్తావిస్తూ వాటిని సక్రమంగా పాటిస్తే బరువు తగ్గవచ్చని తెలిపారు.