ఈ ఫుడ్స్ లో మీకు కనిపించకుండా పురుగులు ఉంటాయ్..!

First Published | Feb 14, 2024, 3:37 PM IST

 ఈ కింది ఆహారాల్లో మనకు కనిపించకుండానే పురుగులు ఉంటాయట. అవి పైకి కనిపించకుండా ఉండిపోతాయి. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 


ప్రతి ఒక్కరికీ కొన్ని ఫేవరేట్ ఫుడ్స్ ఉంటాయి. ఆ ఫుడ్స్ ని మనం అమితంగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే.. మనం మార్కెట్లో దొరికుతూ ఇష్టంగా తినే  కొన్ని ఆహారాలు మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది.  ఈ కింది ఆహారాల్లో మనకు కనిపించకుండానే పురుగులు ఉంటాయట. అవి పైకి కనిపించకుండా ఉండిపోతాయి. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..

1.చాక్లెట్స్..
నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. చాక్లెట్స్ లో మనకు కనిపించకుండా పరుగులు దాగి ఉంటాయి. ఎఫ్ డీఏ గైడ్ లైన్స్ ప్రకారం 125 గ్రాముల చాక్లెట్స్ లో 60 నుంచి 70 పురుగుల శకలాలు ఉంటాయి.

Latest Videos


2.పీనట్ బటర్..
ఎఫ్ డీఏ గైడ్ లైన్స్ ప్రకారం. 16ఔన్సుల పీనట్ జార్ లో 136 పరుగుల శకలాలు ఉంటాయట. ఈ పురుగుల సంఖ్య అంతకంటే ఎక్కువ ఉన్నాయంటే.. ఆ పీనట్ బటర్ ని కలుషితమైనదిగా పరిగణిస్తారు.
 

Image: Freepik

3.కాఫీ బీన్స్..

ప్రతి కప్పు కాఫీలో 120 పురుగుల శకలాలు కలిసే ఉంటాయి. అంటే.. మీరు ఎన్ని కప్పుల కాఫీ తాగితే.. అన్ని పరుగులు మీ కడుపులోకి కూడా చేరినట్లే..

raisins


4.రైజిన్స్..
మనం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని తినే రైజిన్స్ లోనూ పురుగులు ఉంటాయి. ఫ్రూట్ ఫ్లైస్ కి సంబంధించిన గుడ్లు, ఒక్కోసారి ఆ పురుగులు కూడా ఉంటాయట. ఒక కప్పు రైజిన్స్ లో తక్కువలో తక్కువ 35 గుడ్లు, 10 పురుగులు ఉంటాయట.

5.మష్రూమ్స్..
ఎఫ్ డీఏ గణంకాల ప్రకారం ఒక3.5 ఔన్సుల మష్రూమ్స్ లో కూడా 74 పరుగులు ఉంటాయట. అయితే ఇవి కూడా మన కంటికి కనిపించవు.
 

6.ఫ్రోజెన్ బ్రొకలీ..
ఫ్రోజెన్ చేసిన బ్రొకలీలో సైతం చిన్న సైజు పురుగులు చాలా ఉంటాయట. ఈ చిన్న సైజు పురుగులు పరిమాణంలో 2 నుంచి 5 మిల్లీ సెంటిమీటర్ల పొడవుతో ఉంటాయి. కాబట్టి.. ఇక నుంచి ఈ ఆహారాలు తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

click me!