‘బెల్లీ ఫ్యాట్’... ప్రస్తుత కాలంలో అందరినీ తెగ ఇబ్బంది పెడుతున్న సమస్య. ఏదైనా ఇష్టమైన ఫుడ్ కొంచెం తిందామా అన్నా భయపడాల్సి వస్తోంది. ఎక్కడ ఏ ఫుడ్ తింటే బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుందా అనే కంగారు ఎక్కువైపోతోంది. పెరిగిన దానిని ఎలా తగ్గించాలా అనే తిప్పలుపడాల్సి వస్తోంది. దాని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఏమీ కనిపించడం లేదు.
undefined
కాగా.. ఈ బెల్లి ఫ్యాట్ పెరిగిపోవడానికి తెలీకుండా మనం తినే కొన్ని ఆహారా పదార్థాలేనని నిపుణులు చెబుతున్నారు. అంటే.. ముందు మనం బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే.. కొన్ని రకాల ఫుడ్స్ తినకుండా ఉండాలి. ముందు వాటిని ఎవాయిడ్ చేస్తే... ఈ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా...
undefined
1. బ్రెడ్....బెల్లీ ఫ్యాట్ తగ్గించాలి అని అనుకునేవారు ఫస్ట్ చేయాల్సిన పనేంటో తెలుసా.. బ్రెడ్ తినడం మానేయాలి. అంతేకాదు.. బ్రెడ్ తో తయారు చేసే ఫుడ్స్ కూడా దూరం చేయాలి. మీరు తీసుకునే ఆహారంలో దీనిని ఫస్ట్ ఎవాయిడ్ చేయాలి. అప్పుడే మీరు రిజల్ట్ కనిపిస్తుంది.
undefined
2.కూల్ డ్రింక్స్..ఇక తర్వాత చేయాల్సిన మరో పని.. కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి. కూల్ డ్రింక్స్, సోడా లాంటివి తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. వీటిని ఎక్కువగా తాగే వారిలో బెల్లీ ఫ్యాట్ బాగా పెరిగిపోతుంది.
undefined
3.ఫ్రూట్ జ్యూస్..ఫ్రూట్ జ్యూసులు ఆరోగ్యానికి మంచిదే కదా అని అందరూ అనుకుంటారు. అయితే... ఇవి కూడా బెల్లీ ఫ్యాట్ కి కారణమౌతాయని నిపుణులు చెబుతున్నారు. బయట తయారు చేసే వీటిలో షుగర్ ఉంటుంది. అవి కూడా పొట్ట దగ్గర కొవ్వు పెరడానికి కారణమౌతాయి.
undefined
4.వైట్ చాక్లెట్..చాక్లెట్ తినాలి అని బాగా అనిపిస్తే.. కొద్ది గా డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు. కానీ.. వైట్ చాక్లెట్ మాత్రం దూరంగా ఉండాలి. అందులో షుగర్, క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణమౌతుంది.
undefined
5.పొటాటో చిప్స్..చాలా సింపుల్ గా ఉండే ఈ పొటాటో చిప్స్.. మనకు లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి.. వీటికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
undefined
ఇవి తినడం వల్ల కూడా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది.
undefined
ఐస్ క్రీంలు ఎక్కువగా తినడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది...
undefined
పిజ్జా...పేరు వింటనే నోరూరిపోతుంది కదా.. కానీ.. బెల్లీ ఫ్యాట్ విషయంలో చాలా ప్రమాదకరమైన ఫుడ్స్ లో ఇదొకటి. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
undefined