Prawns: రొయ్యలు కొంటున్నారా? ఫ్రెష్ గా ఉన్నాయో లేదో తెలుసుకోండిలా..!

Published : Feb 05, 2025, 12:59 PM IST

మార్కెట్లో ఈ రొయ్యలను ఎప్పటివో తెచ్చి.. ఫ్రీజర్ లో పెట్టి తాజావి అనేసి అమ్మేస్తూ ఉంటారు. అలా కాకుండా.. నిజంగా, తాజా రొయ్యలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

PREV
15
Prawns: రొయ్యలు కొంటున్నారా? ఫ్రెష్ గా ఉన్నాయో లేదో తెలుసుకోండిలా..!
prawns


చికెన్, మటన్ కి ఎంత మంది లవర్స్ ఉన్నారో.. సీఫుడ్స్ లో రొయ్యలను ఇష్టపడేవారు కూడా అంతే ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రొయ్యలను ఇష్టంగా తినేవారు చాలా మంది ఉన్నారు. ఈ రొయ్యలతో కమ్మనైన బిర్యానీ దగ్గర నుంచి.. క్రిస్పీగా స్నాక్స్ వరకు చాలా రకాలుగా చేసుకోవచ్చు. వీటితో ఏది చేసినా రుచిగానే ఉంటుంది. అయితే.. మార్కెట్లో ఈ రొయ్యలను ఎప్పటివో తెచ్చి.. ఫ్రీజర్ లో పెట్టి తాజావి అనేసి అమ్మేస్తూ ఉంటారు. అలా కాకుండా.. నిజంగా, తాజా రొయ్యలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

25
prawns

రొయ్యలు తాజాగా ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి...

1.రొయ్యల తలను చెక్ చేయండి...
మీరు రొయ్యలను కొనుగోలు చేసే సమయంలో అవి తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాటి తలలను చెక్ చేయాలి.  రొయ్యల తలలే వాటి గురించి చెబుతాయి.  రొయ్య తల గట్టిగా ఉందో లేదో చూడాలి. గట్టిగా ఉన్నవాటిని మాత్రమే ఎంచుకోవాలి. అసలు తలలు లేని వాటిని ఎవరైనా అమ్మినా వాటిని కొనుగోలు చేయకూడదు. అంటే... తాజాగా లేవు అని అర్థం చేసుకోవాలి.

35

2.రంగులను తనిఖీ చేయాలి...
రొయ్యలను కొనుగోలు చేసేటప్పుడు వాటి రంగులను కూడా చెక్ చేయాలి. రొయ్యలు తాజాగా లేకపోతే వాటి రంగు మారిపోతాయి. తెల్లగా, లేత గులాబీ రంగులో  ఉన్నవాటినే ఎంచుకోవాలి. అలా కాకుండా.. ముందు రంగులోకి మారి కనిపిస్తే.. వాటిని కొనకూడదు. అవి తాజాగా లేవు అని అర్థం చేసుకోవాలి.

45

prawns 

3.రొయ్యల ఆకృతి...
 రొయ్యల తాజాదనాన్ని నిర్ణయించేటప్పుడు గమనించవలసిన మరో విషయం ఆకృతి. రొయ్యల పెంకు గట్టిగా అనిపిస్తే, అవి తాజాగా ఉంటాయి. వంట కోసం ఉపయోగించవచ్చు. మరోవైపు, అవి అసాధారణంగా మృదువుగా , మెత్తగా అనిపిస్తే, అది మంచి సంకేతం కాదు. అదనంగా, రొయ్యలు చాలా సన్నగా లేదా మెత్తగా లేవని నిర్ధారించుకోండి.

55

4. రొయ్యలను వాసన చూడండి.. రొయ్యల తాజాదనాన్ని గుర్తించడానికి, వాటిని వాసన చూడటం మర్చిపోవద్దు. మీకు అసహ్యకరమైన చేపల వాసన అనిపిస్తే, రొయ్యలు చెడిపోయినట్లు గుర్తించాలి. తాజా రొయ్యలు సముద్రం నుండి నేరుగా వచ్చినట్లుగా వాసన చూస్తాయి. కాబట్టి, మీకు ఏదైనా దుర్వాసన అనిపిస్తే, అవి చెడిపోయినట్లు అర్థం.

5. మచ్చలు చూడండి. రొయ్యలపై అసాధారణ మచ్చలు ఉంటే, అవి నాణ్యతగా లేవని అర్థం చేసుకోవాలి. ఎలాంటి మచ్చలు లేకుండా ఉండే వాటిని మాత్రమే ఎంచుకోవాలి. అవి మాత్రమే తాజాగా ఉన్నట్లు అర్థం.

click me!

Recommended Stories