నెయ్యిని వేడి నీటిలో కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

Published : Jan 20, 2025, 10:26 AM IST

రోజూ ఉదయాన్నే వేడి నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసి.. ఆ నీటిని తాగాలి. రెగ్యులర్ గా ఇలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం....

PREV
15
 నెయ్యిని వేడి నీటిలో కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
ghee water

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారే. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మాత్రం ఆగడం లేదు. మన పూర్వీకులు మాత్రం చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారనే చెప్పాలి. వారు ప్రతి ఆహారం.. కెమికల్స్ లేకుండా, ఆర్గానిక్ గా ఇంట్లోనే పండించుకొని తినేవారు. కానీ.. ఇప్పుడు అలా కాదు.. ప్రతిదీ కొనుక్కొని తినాల్సిందే. పండ్లు, కూరగాయాలు కూడా కెమికల్స్ తోనే పండిస్తున్నారు. అందుకే ఏది తిన్నా జబ్బులు తప్పడం లేదు. అయితే.. ఇలాంటి ఆహారం మధ్యలో కూడా హెల్దీగా ఉండాలంటే.. కొన్ని రెమిడీలు ఫాలో అవ్వాల్సిందే. ముఖ్యంగా నెయ్యితో చేసే ఒక పని.. మనం ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. అవేంటో చూద్దాం...

25

నెయ్యిని రెగ్యులర్ గా తమ ఆహారంలో భాగం చేసుకునేవారు చాలా మందే ఉన్నారు. అయితే... అలా కాకుండా..  రోజూ ఉదయాన్నే వేడి నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసి.. ఆ నీటిని తాగాలి. రెగ్యులర్ గా ఇలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం....

35
ghee

మలబద్దకం...
 ఈరోజుల్లో చాలా మంది కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో మలబద్దకం ఒకటి. దీనికి ఈ నెయ్యి వాటర్ మంచి పరిష్కారం. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలిపి ఉదయాన్నే తాగాలి. అది కూడా పరగడుపున తీసుకోవాలి.  ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్య అనేది ఉండదు. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీవక్రియను నియంత్రించడమే కాకుండా.. జీర్ణ వ్యవస్థను సమస్యల నుంచి దూరం గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

45


బరువు తగ్గడం:

ఊబకాయం సమస్యలు ఉన్నవారు వేడి నీటిలో నెయ్యి కలిపి తినవచ్చు. దీనిలోని లినోలిక్ ఆమ్లం శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వులను కరిగించడంలో , బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.
 

రోగనిరోధక శక్తి:

నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీటితో కలిపినప్పుడు, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది వైరస్లు , బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.
 

55

చర్మ ఆరోగ్యం:

నెయ్యిలోని వివిధ పోషకాలు, విటమిన్ E,  యాంటీఆక్సిడెంట్లు, చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచడంలో సహాయపడతాయి. పురుషులు,  మహిళలు ఇద్దరికీ, వేడి నీటితో కలిపిన నెయ్యి తాగడం వల్ల ముఖం సహజంగా మెరుస్తూ ఉంటుంది.


మెదడు పనితీరు:
నెయ్యిలోని ముఖ్యమైన పోషకాలు జ్ఞాపకశక్తి , అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇటువంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో, మీ రోజువారీ దినచర్యలో వేడి నీటితో కలిపిన నెయ్యిని జోడించడానికి ప్రయత్నించండి.

click me!

Recommended Stories