అవాల్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతి కూర పోపులో వేస్తుంటారు. ఆవాలు ఫుడ్ రుచిని బాగా పెంచుతాయి. కానీ ఈ చిన్న గిజంలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆవాల్లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, సెలీనియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియకు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆవాలను తింటే ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి..
ఆవాలు మన జీర్ణవ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అజీర్తి సమస్యలున్నవారికి ఆవాలు ఔషదంతో సమానం. ఈ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణ శక్తిని పెంచుతుంది.
ఎముకలకు మేలు
ఆవాలు మన ఎముకలను బలంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఆవాల్లో సెలీనియం అనే ఖనిజం ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా చేస్తుంది. అలాగే ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గోళ్లను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గుండె ఆరోగ్యం
ఆవనూనెను కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఆవనూనెను వంటలకు ఉపయోగించడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది.
తలనొప్పి నుంచి ఉపశమనం
ఆవాలలో మెగ్నీషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఒంటి నొప్పిని తగ్గిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.
చర్మానికి మేలు
సీజన్ మారడంతో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఆవాలు మన ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఆవాలు మన చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అలాగే మొటిమలను తగ్గిస్తాయి. ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల మంటను తగ్గిస్తాయి.