బెండకాయ కూరను తింటే ఏమౌతుందో తెలుసా?

Published : Dec 05, 2024, 04:10 PM IST

బెండకాయల్లో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.అయితే బెండకాయ కూరను తింటే ఏం జరుగుతుందో తెలుసా?

PREV
15
బెండకాయ కూరను తింటే ఏమౌతుందో తెలుసా?

కూరగాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. మనల్ని ఆరోగ్యంగా ఉంచే కూరగాయల్లో బెండకాయ ఒకటి. ఈ హెల్తీ కూరగాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని కూర కూడా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఈ కూరగాయలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి. దీన్ని వండుకుని తినడం కంటే పచ్చిగా తింటేనే బోలెడు లాభాలు కలుగుతాయి.

ఈ మధ్యే జరిగిన ఒక అధ్యయనంలో బెండకాయను పచ్చిగా తింటే ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు మన శరీరానికి అందుతాయని తేలింది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ బెండకాయ కూరను తినడం చాలా మంచిది. అసలు బెండకాయ కూరను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25

బెండకాయలోని పోషకాలు

బెండకాయలో మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో మెండుగా ఉండే విటమిన్ కె మన ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కూరగాయలో ఫోలెట్,  మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలో పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి. 

 బరువు తగ్గుతారు

బరువు తగ్గాలనుకునేవారికి కూడా బెండకాయ ఎంతగానో సహాయపడుతుంది. మీరు 100 గ్రాముల బెండకాయను తింటే 33 కేలరీలను మాత్రమే పొందుతారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు బెండకాయను తమ ఆహారంలో చేర్చుకోవాలి. బెండకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే ఆకలిని తగ్గిస్తుంది.మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కూరగాయను తింటే పేగు కదలికలు మెరుగుపడతాయి. 

35

బెండకాయ గింజల గురించి తెలుసా? 

బెండకాయ గింజలు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ గింజల్ని వేయించి కాఫీని తయారుచేస్తారు తెలుసా? యుద్ధ సమయాల్లో కాఫీ కొరత ఏర్పడినప్పుడు ఈ గింజలతోనే కాఫీ తయారు చేసేవారట. అయితే కాఫీ గింజల్లో మాదిరిగా ఈ బెండ గింజల్లో కెఫిన్ కంటెంట్ ఉండదు. కానీ ఈ గింజల్తో చేసిన కాఫీ మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. 

45
బెండకాయ ఆరోగ్య ప్రయోజనాలు

ఎన్నో వ్యాధులకు ఔషధం బెండకాయ! 

బెండకాయలో ఉండే జిగురు పదార్థంలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇది మన శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది.బెండకాయలో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. దీన్ని తింటే జీర్ణ సమస్యలు రావు. అలాగే గొంతు నొప్పి తగ్గుతుంది. జీర్ణ సమస్యలు నయమవుతాయి.

డయాబెటిస్ పేషెంట్లకు బెండకాయ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీన్ని తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోజూ బెండకాయ కూరను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాల ముప్పును తగ్గిస్తుంది. 

55

గుండె ఆరోగ్యం:  

బెండకాయను ఎక్కువగా తినే వారి గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలోని జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన  కొలెస్ట్రాల్‌ ను తగ్గించడానికి సహాయపడుతుంది. బెండకాయలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ గుండె పనితీరు మెరుగుపర్చడానికి సహాయపడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories