ఈరోజుల్లో వంట చేయడం చాలా సులభం అయిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రెజర్ కుక్కర్ లో వంట చేయడా చాలా ఈజీ. కానీ, ఈ కుక్కర్లలో అన్ని రకాల వంటలను చేయకూడదని చెబుతూ ఉంటారు. కొందరైతే ప్రెజర్ కుక్కర్ లో అన్నం కూడా వండకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ.. ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం…
ప్రెజర్ కుక్కర్ లో వండినప్పుడు.. రైస్ లోని పోషకాలు బయటకుపోయే అవకాశం ఉండదు. బయటకు పోకుండా.. మూత పెట్టేసి ఉంటుంది కాబట్టి.. పోషకాలు అలానే ఉండటం వల్ల.. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండే సమయంలో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల బియ్యంలో , లేదంటే వాటర్ లో ఏదైనా బ్యాక్టీరియా లాంటివి ఉంటే నాశనం అయిపోతాయి.
ఈ కుక్కర్ లో అన్నం వండినప్పుడు.. రైస్ లో ఉండే స్టార్చ్ తగ్గిపోతుందట. అంతేకాదు.. ఆ అన్నంలో ఫ్యాట్ శాతం కూడా తగ్గిపోతుంది. దాని వల్ల మనం బరువు పెరుగుతాం అనే భయం అక్కర్లేదు.
మనం విడిగా వండిన అన్నం కంటే.. ప్రెజర్ కుక్కర్ లో వండిన అన్నం సులభంగా జీర్ణం అవుతుంది. ఈ అన్నం తింటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా.. ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండటం వల్ల దానిలో ఉండే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ప్రోటీన్, ఫైబర్, కార్బో హైడ్రేట్స్ పోకుండా… అందులోనే ఉంటాయట.
మనం విండిగా స్టవ్ మీద వండిన అన్నం కంటే.. ప్రెజర్ కుక్కర్ లో అన్నం చెమ్మలేకుండా, రుచిగా ఉంటుంది.