ధనియాల వాటర్ తో ఇన్ని లాభాలా?

First Published | Sep 12, 2024, 11:14 AM IST

కిచెన్ లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి. ఈ ధనియాలను మనం చాలా రకాల వంట్లో వాడుతూ ఉంటాం. ఈ ధనియాలను  పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ.. రోజూ ఉదయం ఒక్క గ్లాస్ ఈ గింజల నీరు తాగితే..  ఎవరూ ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. మెరిసే చర్మం దగ్గర నుంచి.. జుట్టు ఒత్తు పెరగడమే కాకుండా.. చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి.. ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..
 

ధనియాలలో  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయి.  యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి చాలా  అవసరం. ఇవి.. మన బాడీలోని టాక్సిన్స్ మొత్తాన్ని బయటకు వెళ్లేలా చేస్తాయి. ఈ క్రమంలో మనం రెగ్యులర్ గా ధనియాల వాటర్ తాగడం వల్ల.. టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది.. బెస్ట్ డీ టాక్స్ డ్రింక్ గా సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారికి.. ఈ జీగా బరువు తగ్గేలా చేయడంలోనూ సహాయం చేస్తుంది.

ఇక  ఈ రోజుల్లో వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ  జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, మంచి లైఫ్ స్టైల్ ఫాలో కాకపోవడం కారణం ఏదైనా విపరీతంగా జుట్టురాలిపోతూ ఉంటుంది. అలాంటివారు.. రెగ్యులర్ గా ఈ ధనియా వాటర్ తాగితే సరిపోతుంది. కచ్చితంగా.. జుట్టు రాలడం తగ్గి.. మళ్లీ బాగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది.

బలహీనమైన జుట్టు కుదుళ్లు, హార్మోన్ల అసమతుల్యత , ఒత్తిడి కారణంగా, సరైన  ఆహారం తీసుకోకపోవడం వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. ధనియాల గింజలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. కొత్త జుట్టు అభివృద్ధికి మూలాలను ఉత్తేజపరుస్తాయి. అవి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. మరింత అభివృద్ధిని ప్రారంభిస్తాయి, ఈ విధంగా మీ జుట్టు రాలడం సమస్యలను అదుపులో ఉంచుతాయి.


జీర్ణ ఆరోగ్యం

ధనియాల వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల.. అనేక జీర్ణ సమస్యలకు పులిస్టాప్ పెట్టొచ్చు. ఎవరికైతే ఆహారం సులభంగా జీర్ణం అవ్వడం లేదు అని ఫీలౌతున్నారో.. వారు రెగ్యులర్ గా ఈ ధనియాల వాటర్ తీసుకోవడం  మొదలుపెడితే చాలు. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీవక్రియ రేటు పెరుగుతుంది. ఈ రెండు ప్రయోజనాలు.. బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

ధనియాల నీళ్ళు కడుపు ఆరోగ్యాన్ని , జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇది గ్యాస్ , ఆసిడిటీ సమస్యలకు మంచి పరిష్కారం. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గడానికి చాలా మంచిది.
 

కాంతివంతమైన చర్మం

ధనియాలలో  ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఉదయం ధనియాల నీళ్ళు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. మృదువైన, స్పష్టమైన చర్మాన్ని పొందవచ్చు. పలు పరిశోధనల ప్రకారం.. ధనియాల వాటర్ తాగడం వల్ల తామర, చర్మం దురద, దద్దుర్లు  వాపు వంటి వివిధ చర్మ వ్యాధులను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి, ఎందుకంటే అవి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటిపూత . పుండ్లను కూడా నయం చేస్తాయి. విత్తనాలలో లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చికాకును తగ్గించడానికి నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది.  ముఖం కాంతివంతంగా మెరిసేలా చేయడంలోనూ చాలా బాగా సహాయపడతాయి.

Latest Videos

click me!