ఇది తెలిస్తే వంకాయ తినడానికి నో చెప్పరు

First Published Feb 1, 2024, 1:10 PM IST

వంకాయతో చేసిన ఏ కూరైనా టేస్ట్ అదిరిపోతుంది. కానీ చాలా మంది వంకాయను తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే దీనివల్ల కాళ్ల నొప్పులు ఎక్కువ కావడంతో పాటుగా ఇతర సమస్యలొస్తాయని భావిస్తారు. కానీ వంకాయ చేసే మేలు తెలిస్తే మాత్రం దీన్ని తినకుండా అస్సలు ఉండలేరు.

వంకాయను ఆసియా దేశాల్లోనే కాకుండా ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఉపయోగిస్తారు. అయితే కొంతమందికి వంకాయ తినడానికి అలెర్జీ ఉంటుంది. ఇలాంటి వారు డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వంకాయను తమ ఆహారంలో చేర్చుకోవాలి. అయితే కొంతమంది ఎలాంటి అలెర్జీ లేకున్నా కూడా వంకాయను తినరు. వీళ్లకు వేళ్లే వంకాయ మంచిది కాదని భావిస్తారు. అసలు వంకాయను ఎందుకు తినాలి? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

యాంటీఆక్సిడెంట్లు అధికం

వంకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో వంకాయను చేర్చడం వల్ల మీ శరీరానికి సహజ రక్షణను అందుతుంది. అవును వంకాయను తింటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇది వృద్ధాప్య రూపాన్ని కూడా తగ్గిస్తుంది. వంకాయను తింటే మీరు యవ్వనంగా కనిపిస్తారు కూడా. 
 

గుండెకు మంచిది

వంకాయలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి తో పాటుగా బి విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతాయి. దీనిలో ఉండే డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే పొటాషియం కంటెంట్ అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

రక్తంలో చక్కెర నియంత్రణ 

డయాబెటిస్ ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకునే వారికి వంకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. వంకాయలోని కొన్ని సమ్మేళనాలు గ్లూకోజ్ శోషణను మందగించేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. వంకాయను ఆహారంలో చేర్చడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది జీవక్రియ సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యానికి మద్దతునిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల

వంకాయలోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ సాధారణంగా ప్రేగు కదలికలను ప్రేరేపిస్తుంది. అలాగు మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది సమతుల్య గట్ మైక్రోబయోమ్ కు కూడా దోహదం చేస్తుంది. మీ ఆహారంలో వంకాయను చేర్చడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
 

click me!