ఉదయాన్నే రాగి జావ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Mar 30, 2024, 2:15 PM IST

దీనిని జావ లాగా మాత్రమే కాదు.. పలు రకాలుగా కూడా తీసుకోవచ్చు. రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి సంకటి.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా.. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది
 

ragi

మనం  రోజులో తీసుకునే ఆహారంలో అల్పాహారం చాలా కీలకం అయినది. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా.. అది మనం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది.  అందుకే.. మధ్యాహ్నం, రాత్రి బోజనం స్కిప్ చేసినా.. అల్పాహారం మాత్రం కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా.. అల్పాహారమే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మధ్యాహ్నం కొంచెం తక్కువ.. రాత్రిపూట మరింత లైట్ గా తినాలి. అప్పుడు ఆరోగ్యం మన సొంతమౌతుంది.
 

ragi halwa

ఇక.. అసలు విషయంలోకి వస్తే... ఉదయం అల్పాహారంలో రాగి జావ తాగితే కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం... రాగి జావ గురించి తెలియని వారు ఉండరు. రాగి పిండితో చేసే అత్యంత ఆరోగ్యకరమైన పానీయం అని చెప్పొచ్చు.  ఈ రాగిలో ఫైబర్, ప్రోటీన్, న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని జావ లాగా మాత్రమే కాదు.. పలు రకాలుగా కూడా తీసుకోవచ్చు. రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి సంకటి.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా.. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది
 


Ragi idly

రాగులు గ్లూటెన్ ఫ్రీగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ఇవి తినడం వల్ల.. మన శరీరంలోని కొలిస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. అంతేకాకుండా.. గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మొత్తం ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ కీలకంగా పని చేస్తుంది.
 

Ragi

ఈ కాలంలో చాలా మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. అలాంటివారు కనుక.. రోజూ బ్రేక్ ఫాస్ట్ లో రాగి జావ లేదంటే... రాగిపిండితో చేసిన ఆహారాలను తీసుకుంటే.. వారిలో ఐరన్ లోపం  తగ్గిపోతుంది.
 

అంతేకాదు.. బరువు తగ్గాలి అనుకునేవారు ఈరోజుల్లో ఏవేవో ఫుడ్స్ తింటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో మంచిగా ఒక గ్లాస్ రాగి జావ తాగితే.. కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. బరువు తగ్గడంలోనూ ఈజీగా సహాయపడుతుంది.
 

We get these amazing benefits from ragi

అంతేకాదు.. బరువు తగ్గాలి అనుకునేవారు ఈరోజుల్లో ఏవేవో ఫుడ్స్ తింటున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో మంచిగా ఒక గ్లాస్ రాగి జావ తాగితే.. కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. బరువు తగ్గడంలోనూ ఈజీగా సహాయపడుతుంది.
 

ఇవి మాత్రమే కాదు...డయాబెటిక్స్ తో బాధపడుతున్న వారు కూడా.. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా.. రాగి జావ, రాగి ఇడ్లీలను తీసుకుంటే సరిపోతుంది. ఇవి తినడం వల్ల.. మీ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

ఎముకలు బలంగా మార్చడంలోనూ రాగులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు.. రాగిజావను కచ్చితంగా తీసుకోవాలి. 

Latest Videos

click me!