ఎవరైనా తాము ఎలాంటి ఆహారం తీసుకున్నా కూడా బరువు పెరగడం లేదని బాధపడుతుంటే.. వాళ్లకు ఈ ఖర్జూరం, పాలు బెస్ట్ ఆప్షన్. రోజుకి 4 లేదంటే 5 ఖర్జూరాలను పాలల్లో నానపెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల.. వారు సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ పెరిగే బరువు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఖర్జూరాలను పాల్లలో నానపెట్టి తినడం వల్ల…. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల… తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గిస్తుంది.