కరివేపాకు మనల్ని ఎన్ని రోగాల నుంచి రక్షిస్తుందో తెలుసా?

First Published Feb 1, 2024, 3:37 PM IST

కరివేపాకు మన రోజువారి ఆహారంలో ఒక భాగం. ముఖ్యంగా దీనిని దక్షిణ భారత వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని ప్రత్యేక వాసన ఫుడ్ రుచిని బాగా పెంచుతుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

కరివేపాకు వాసన కమ్మగా ఉంటుంది. అందుకే మనం దీన్ని ప్రతి కూరలో వేస్తాం. కరివేపాకు ఫుడ్ రుచిని బాగా పెంచుతుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుగా బరువును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. కరివేపాకు వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కఫం

కరివేపాకులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కఫం రాకుండా మనల్ని కాపాడుతుంది.

రక్త నష్టం 

కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది రక్త నష్టాన్ని తగ్గిస్తుంది. 
 

డయాబెటిస్ 

డయాబెటిస్ పేషెంట్లకు కరివేపాకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని షుగర్ పేషెంట్లు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మాత్తుగా పడిపోయినప్పుడు, దానిని నియంత్రించడానికి కరివేపాకును నమలండి. 

జీర్ణశక్తి

కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

కళ్లకు అవసరం

కరివేపాకులో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. అలాగే కంటిశుక్లం వంటి వ్యాధుల నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది.
 

curry leaves

మార్నింగ్ సిక్ నెస్ 

కరివేపాకును నమలడం వల్ల గర్భిణుల్లో మార్నింగ్ సిక్ నెస్, వాంతులు వంటి సమస్యలు తగ్గిపోతాయి. 

జుట్టు

కరివేపాకులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి కరివేపాకు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. 
 

చర్మ ఆరోగ్యం

కరివేపాకు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ నష్టాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. చర్మంపై కనిపించే సన్నని గీతలు, ముడతలను తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. 

క్యాన్సర్ 

కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.
 

గుండె సంబంధిత సమస్యలు 

కరివేపాకు బ్లడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ రెండింటినీ తగ్గిస్తుంది. అలాగే ఇది మంచి యాంటీఆక్సిడెంట్. దీంతో ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. ఇది గుండె ధమనులపై ఫలకం పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అలాగే గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. 

click me!