పెరుగు, ఉల్లిపాయ కాంబినేషన్ మీకు ఇష్టమా..? ఈ రెండూ కలిపి తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 8, 2024, 9:51 AM IST

అయితే.. ఈ వెజిటేబుల్ రైతాలో.. ఉల్లిపాయను కలిపితే మాత్రం.. మీరు ఆ ఫుడ్ ని పాడుచేస్తున్నట్లే లెక్క.

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు.  ఉల్లిపాయ తినడం వల్ల.. మన కడుపులో చల్లని అనుభూతి కలుగుతుంది. అంతేకాదు.. ఉల్లిపాయలో చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇక..పెరుగు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మన గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.  ఈ రెండూ మన ఆరోగ్యానికి చాలా మంచే చేస్తాయి. కానీ.. ఈ రెండు కలిపి తీసుకుంటే ఏమౌతుందో మీకు తెలుసా?

మనలో చాలా మందికి రైతా తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం ఈ రైతాను ఎక్కువగా తింటూ ఉంటారు. రైతాను చాలా రకాలుగా తింటారు. కొందరు వెజిటేబుల్ రైతా తీసుకుంటారు. ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం.. అయితే.. ఈ వెజిటేబుల్ రైతాలో.. ఉల్లిపాయను కలిపితే మాత్రం.. మీరు ఆ ఫుడ్ ని పాడుచేస్తున్నట్లే లెక్క.


కేవలం రైతా మాత్రమే కాదు.. మనలో చాలా మందికి పెరుగున్నంలో  పచ్చి ఉల్లిపాయ కూడా తింటూ ఉంటారు. కానీ.. అసలు పెరుగు, ఉల్లిపాయ రెండూ కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకు పెరుగు, ఉల్లిపాయ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆయుర్వేదం ప్రకారం, పెరుగు, ఉల్లిపాయలను 'విరుధ్ అన్న'గా పరిగణిస్తారు, అంటే వ్యతిరేక ప్రభావాలతో కూడిన ఆహారం. పెరుగు ప్రకృతిలో చల్లగా ఉన్నప్పుడు, ఉల్లిపాయలు వేడిగా పరిగణిస్తారు. ఈ రెండూ కలిసి వచ్చినప్పుడు, అవి మీ శరీరంలోని దోషాల - వాత, పిత్త , కఫాల అసమతుల్యతను సృష్టిస్తాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, అత్యంత సాధారణమైనవి అజీర్ణం, ఆమ్లత్వం, ఉబ్బరం , ఇతర సమస్యలను కూడా కలిగిస్తాయి.

Onions

ఈ రెండూ కలిపి తినడం వల్ల  శరీరంలో అధిక వేడిని సృష్టిస్తుంది , టాక్సిన్ స్థాయిలను పెంచుతుంది, ఇది చర్మ అలెర్జీలు , దద్దుర్లు, తామర , సోరియాసిస్‌తో సహా ప్రతిచర్యలకు దారితీయవచ్చు. కొన్ని సందర్భాల్లో, ప్రతిచర్య కూడా తీవ్రంగా ఉంటుంది, ఇది వాంతులు , ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది.


అయితే.. మనం కొన్ని మార్పులు చేసుకుంటే.. పెరుగు, ఉల్లిపాయ కాంబినేషన్ ని ఆస్వాదించవచ్చు. అదేంటో తెలుసా..? మనం పెరుగులో పచ్చి ఉల్లిపాయ కలపకుండా.. ఆ ఉల్లిపాయను కొద్దిగా నూనెలో వేగనిచ్చి ఆ తర్వాత పెరుగులో కలుపుకోవచ్చు. దీని వల్ల ఆరెండింటి రియాక్టివ్ శక్తి తగ్గుతుంది. 

onion

 ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ లెవల్స్ ని తగ్గించడానికి మీరు వాటిని కాస్త వేయించి తర్వాత పెరుగులో కలుపుకోవాలి. అది కూడా కాస్త మితంగా కలుపుకోవాలి. వేయించడం వల్ల పోషకాలు పోతాయనే భయం అక్కర్లేదు. హ్యాపీగా.. మనం ఈ కాంబినేషన్ ని ఆస్వాదించవచ్చు.

Latest Videos

click me!