హైదరాబాద్ ఫుడ్ కి చాలా ఫేమస్. ఎన్నో రకరకాల రుచికరమైన ఆహారం ఇక్కడ లభిస్తుంది. ఎన్ని రకాల ఆహారాలు ఉన్నా.. హైదరాబాద్ అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం బిర్యానీనే. మన దేశంలో హైదరాబాద్ బిర్యానీ కి ఉన్న రుచి ... మరే ప్రాంతంలో దొరకదంటే అతిశయోక్తి లేదు. అందుకే.. అందరూ బిర్యానీ అంటే పడి చచ్చిపోతుంటారు. చిన్నా, పెద్ద అకేషన్ అనే తేడా లేకుండా అందరూ బిర్యానీనే లాగించేస్తుంటారు.
అయితే.. మన హైదరాబాద్ లో బిర్యానీని మించిన ఫుడ్స్ ఉన్నాయి. బిర్యానీ మాయలోపడి కొన్ని రకాల ఫుడ్స్ ని అసలు కన్నెత్తి కూడా చూడటం మర్చిపోయాం. మరి ఆ ఫుడ్స్ ఏంటి..? వాటి రుచి ఎలా ఉంటుందో.. ఇన్ని రోజులు మనం ఇంత రుచికరమైన ఫుడ్ ని మిస్ అయ్యామో ఇప్పుడు చూసేద్దాం.. ఇవన్నీ ప్యూర్ వెజ్ కావడం విశేషం. ప్యూర్ వెజిటేరియన్స్ కి ఇవి బెస్ట్ ఫుడ్స్ అని చెప్పొచ్చు.
1.కట్టి దాల్.. మీరు పప్పులో చాలా రకాలు రుచి చూసి ఉంటారు. కానీ కట్టి దాల్ ఎప్పుడైనా రుచి చూశారా..? క్రీమీ దాల్ మకనీ తినే ఉంటారు.. నార్త్ స్టైల్, గుజరాత్ స్టైల్ దాల్ కూడా తినే ఉంటారు. అయితే.. అంతకు మించిన రుచి అందిస్తుంది కట్టీ దాల్. ఒక్కసారి రుచి చూస్తే.. మళ్లీ దానిని మీరు వదిలిపెట్టరు.
2.మిర్చీకా సలాన్.. వెజిటేరియన్స్ కి ఇది కూడా బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. గ్రీన్ చిల్లీ, పల్లీలు, కరివేపాకు, చింతపండు కలిపి చేసే ఈ మర్చికా సలాన్ చాలా టేస్ట్ గా ఉంటుంది. మంచి స్పైసీ ఫుడ్ ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది. వేడి వేడిగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది. కొందరు ఈ దీనిని బిర్యానీతో పాటు సర్వ్ చేస్తారు. కానీ పెద్దగా ఎవరూ నోటిస్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి తింటే మర్చిపోరు.
3.బగారా బైంగన్. మనం తరచూ వంకాయతో రకరకాల వంటలు చేసుకుంటూనే ఉంటాం. అయితే.. బగారా బైంగన్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. వంకాయలు నిలువుగా చీల్చి మసాలా కూర్చి మరీ దీనిని తయారు చేస్తారు. దీనిని నార్మల్ రైస్ లో లేదా.. వెజిటేబుల్ రైస్ లో కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది.
4.డబుల్ కా మీటా.. ది బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చు. బ్రెడ్ తో చేసే ఈ స్వీట్.. హైదరాబాద్ లో తయారు చేసినంత రుచిగా ఇంకెక్కాడా చేయలేరేమో అనే సందేహం కలుగుతుంది. చాలా రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే.. దీనిని ఉచితంగా కూడా ఇస్తుంటారు. దీనిని ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సులువు. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. దీనికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.
5.బురానీ రైతా.. బిర్యానీతో పాటు మనకు రైతా కూడా అందిస్తూనే ఉంటారు. అందులో బురానీ రైతా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రైతాని వెల్లులితో తయారు చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. దీనిని బిర్యానీలో కలిపి తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
6.హైదరాబాదీ ఫిర్నీ.. ఇది చూడటానికి కీర్ లాగే ఉంటుంది. దీనిని రైస్, పంచదార, పాలతో తయారు చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. దీనిని విరిగిపోయిన బియ్యంతో తయారు చేస్తారు. అది దీని ప్రత్యేకత. పండగల సమయంలో ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు.
7. చౌగ్రా.. క్యాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, వంకాయ లను డీప్ ఫ్రై చేసి.. దానిలో పెరుగు కలిపి చేసే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సైడ్ డిష్ గా తీసకుంటారు. రైస్ లో కూడా కలిపి తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.