బెండకాయ కూరను ఇలా మాత్రం తినకూడదు

First Published | Dec 1, 2024, 3:25 PM IST

బెండకాయ కూర మన  ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. కానీ బెండకాయ కూరను కొన్నింటితో కలిపి తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూరగాయలు ముందుంటాయి. అందుకే మాంసాహారాల కంటే కూరగాయల్నే ఎక్కువగా తినాలని డాక్టర్లు చెప్తుంటారు.కానీ ఆయుర్వేదం ప్రకారం.. మనం తినే, తాగే ఆహారాలకు కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే కొన్ని రకాల కూరగాయల్ని కొన్నింటితో కలిపి అస్సలు తినకూడదు. ఇలాంటి వాటిలో బెండకాయ కూడా ఉంది. అసలు బెండకాయ కూరను వేటితో తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బెండకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ కూరగయాలో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఫోలెట్, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం..బెండకాయ మన ఆరోగ్యానికి మంచిదే అయినా..దీన్ని కొన్ని ఆహారాలతో కలిపి అస్సలు తినకూడదు. దీనివల్ల బెండకాయ వల్ల ప్రయోజనాలకు బదులుగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బెండకాయను వేటితో కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


బెండకాయతో తినకూడని ఆహారాలు

పాలు 

బెండకాయ కూరను తిన్న తర్వాత మీరు పాలను తాగకూడదు. ఎందుకంటే పాలు, బెండకాయ రెండింటిలో కాల్షియం ఉంటుంది. అలాగే బెండకాయలో ఆక్సలేట్ కూడా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ మన కిడ్నీల్లో రాళ్లు వచ్చేలా చేస్తుంది. కాబట్టి బెండకాయను తిన్న తర్వాత పాలను తాగకూడదు. 

కాకరకాయ

కాకరకాయ, బెండకాయ కూరను కలిపి తినకూడదు. ఎందుకంటే ఈ రెండు కూరలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ మీకు ఇప్పటికే జీర్ణ సమస్యలు గనుక ఉంటే కాకరకాయ, బెండకాయ కూరను కలిపి తినకూడదు. బెండకాయలో చలువ చేసే గుణం ఉంటుంది. అయితే కాకరకాయలో వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తింటే మ కడుపులో pH బ్యాలెన్స్‌ దెబ్బతింటుంది. దీనితో మీకు అజీర్ణం, కడుపు నొప్పి, మలబద్దకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. 

ముల్లంగి

ముల్లంగిని తింటూ బెండకాయ కూరను తినకూడదు. అలాగే బెండకాయను తినేటప్పుడు ముల్లంగిని కూడా తినకూడదు. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తింటే కడుపులో గ్యాస్ సమస్య వస్తుంది. ముల్లంగిలో సల్ఫర్ ఉంటుంది. ఇది మీ గ్యాస్ సమస్యను ఎక్కువ చేస్తుంది. అందుకే ముల్లంగి, బెండకాయను కలిపి తినకూడదు.

రెడ్ మీట్

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రెడ్ మీట్ ను, బెండకాయను కలిపి అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ బెండకాయ, రెడ్ మీట్, బెండకాయ రెండూ జీర్ణ కావడానికి చాలా టైం పడుతుంది. ఈ రెండింటిని కలిపి తింటే జీర్ణ సమస్యలతో పాటుగా కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. 

టీ

చాలా మంది ఉదయమే కాదు మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా టీ తాగుతుంటారు. అయితే మీరు మధ్యాహ్నం బెండకాయ కూరను తిన్న తర్వాత టీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే మీరు తిన్న ఆహారంలో నుంచి పోషకాలు శోషించడటం ఆగుతుంది.దీనివల్ల బెండకాయను తిన్నా ఎలాంటి లాభం ఉండదు.

Latest Videos

click me!