మార్కెట్లో చవకగా దొరికే కూరగాయ ఏదైనా ఉంది అంటే అది సొరకాయ అని చెప్పొచ్చు. ఈ కాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు సొరకాయలో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు మరే ఇతర కూరగాయల్లో లేవు.