రాత్రిపూట వీటికి దూరంగా ఉంటే బరువు తగ్గడం ఈజీ..!

Published : Jan 20, 2025, 04:35 PM IST

వేగంగా బరువు తగ్గాలంటే.. రాత్రిపూట పొరపాటున కూడా కొన్ని రకాల ఫుడ్స్ ని తినకూడదట. మరి, వేటికి దూరంగా ఉంటే బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం....  

PREV
16
రాత్రిపూట వీటికి దూరంగా ఉంటే బరువు తగ్గడం ఈజీ..!
weight loss

బరువు తగ్గాలని అనుకునేవారు ఈరోజుల్లో చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు. ఆ బరువు తగ్గించుకోవడం కోసం దాదాపు అందరూ ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తూ ఉంటారు. ఉదయం మొత్తం కష్టపడి డైట్ చేసి,.. రాత్రికి ఏవేవో అన్ హెల్దీ ఫుడ్స్ తినేస్తూ ఉంటారు. దాని వల్ల మళ్లీ బరువు పెరిగేస్తూ ఉంటారు. అలా కాకుండా.. వేగంగా బరువు తగ్గాలంటే.. రాత్రిపూట పొరపాటున కూడా కొన్ని రకాల ఫుడ్స్ ని తినకూడదట. మరి, వేటికి దూరంగా ఉంటే బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం....

26
weight loss

పగటిపూట మన శరీర జీవక్రియ చాలా బాగా పని చేస్తుంది. కానీ, సాయంత్రానికి జీవక్రియ నెమ్మదిస్తుంది. దీని వలన రాత్రి పూట తినే భోజనం ప్రాసెస్ చేయడం కష్టంగా ఉంటుంది.  అందుకే.. బరువు తగ్గాలి అనుకునేవారు.. సాయంత్రం, రాత్రి ఏం తింటున్నాం అనే విషయంపై కాస్త ఎక్కువ శ్రద్ధ చూపించాలి.

36
Using frozen foods is a serious problem


1.ప్రోజెన్ చేసిన ప్రాసెస్ ఫుడ్స్...
ప్రాసెస్ చేసిన ఫ్రోజెన్ పుడ్స్ బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఇవి మనకు తినడానికి చాలా బాగుంటాయి. కానీ... బరువు తగ్గాలి అనుకునేవారికి అస్సలు సూట్ అవ్వవు. ఇలాంటి ఫుడ్స్ ఆరోగ్యానికి కూడా చాలా హాని చేస్తాయి. వీటిని పదే పదే వేడ చేసి తినడం వల్ల అందులో ఎలాంటి పోషకాలు కూడా ఉండవు. పైగా క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
 

46


2.మైక్రోవేవ్ పాప్ కార్న్...
పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదే కానీ... మైక్రోవేవ్ లో చేసే పాప్ కార్న్ మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటిని తినడం వల్ల.. మీరు తగ్గాలి అనుకునే బరువు తగ్గలేరు.
 

56


కార్బోనేటేడ్ పానీయాలు
కూల్ డ్రింక్స్, కార్బోనేటేడ్ పానీయాలు రాత్రి సమయాల్లో ప్రత్యేక సవాళ్లను కలిగిస్తాయి. వాటి అధిక చక్కెర కంటెంట్ , కార్బోనేషన్ జీర్ణక్రియ , నిద్ర విధానాలకు అంతరాయం కలిగిస్తాయి, పగటిపూట తిన్నప్పుడు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.

66

కెచప్
ఈ సాధారణ మసాలాలో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ (HFCS) ఉంటుంది, ఇది సాయంత్రం భోజనానికి ఊహించని చక్కెర భారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో కెచప్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కేలరీల తీసుకోవడం పెరుగుతుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్
రెస్టారెంట్-శైలి ఫ్రెంచ్ ఫ్రైస్‌లో గణనీయమైన మొత్తంలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ , కేలరీలు ఉంటాయి. బరువు తగ్గకపోగా, బరువు పెరగడానికి కారణం అవుతాయి.


ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మత్రమే కాదు.. సాయంత్రం తీసుకునే ఆహారాలు చాలా తేలికగా ఉండాలి. అది కూడా నిద్రపోవడానికి రెండు గంటల ముందు భోజనం  పూర్తి చేయాలి.

click me!

Recommended Stories