మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తినండి

First Published | May 27, 2023, 3:47 PM IST

కొలెస్ట్రాల్ స్థాయిలను నియింత్రించడానికి  కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఎంతో సహాయపడతాయి. ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతాయి. అవేంటంటే.. 
 

heart health

తప్పుడు జీవనశైలి వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు అది గడ్డకడుతుంది. ఇది రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ మీకు సహాయపడతతాయి. ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తాయి. 

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి

మెడికల్ న్యూస్ టుడే ప్రకారం.. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన అంటుకునే మూలకం. ఇది రెండు లిపోప్రొటీన్ల రూపంలో రక్త ప్రవాహం ద్వారా శరీరంలో ఉంటుంది. ఒకటి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే ఎల్డిఎల్. మరొకటి అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే హెచ్డిఎల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను చెడు కొలెస్ట్రాల్ అంటారు. దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్ కు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఈ ఆహారాలను తినండి. 
 

Latest Videos


వెల్లుల్లి, ఉల్లిపాయ

వెల్లుల్లి, ఉల్లిగడ్డలను వంటల్లో తప్పకుండా ఉపయోగిస్తారు. ఈ రెండు పదార్థాలు లేకుండా ఏ వంటకం సంపూర్ణంగా ఉండదు. వెల్లుల్లిలో హైపర్ లిపిడెమియా లక్షణాలు కనిపిస్తాయి. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ మూలకం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ ఆక్సీకరణ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది.
 

Soaked Almonds

బాదం,  పెరుగు

బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్ కు ప్రధాన వనరులు. ఇది శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. నిజానికి ప్రోబయోటిక్స్ సహాయంతో మెటబాలిజం పెరుగుతుంది. ఇది మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

Image: Getty Images

ఓట్స్, అరటిపండ్లు

ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే మన శరీరానికి మంచి  పోషణ అందుతుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు పెరిగే  ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. మాయో క్లినిక్ ప్రకారం.. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయి తగ్గుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల శరీరంలోని రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ శోషణ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే కరిగే ఫైబర్ మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. అందులో అరటిపండ్లు చేర్చుకుంటే శరీరంలో పీచు పదార్థం పెరుగుతుంది.
 

గ్రీన్ టీ, నిమ్మకాయ

బరువు తగ్గడం నుంచి జీవక్రియను పెంచడం వరకు.. గ్రీన్ టీ మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ టీలోని మూలకాలు శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి పనిచేస్తాయి. అలాగే నిమ్మలో ఉండే ఫ్లేవనాయిడ్స్ కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. నిమ్మకాయలో ఫ్లేవనాయిడ్లతో సహా అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం గ్రీన్ టీని తయారు చేసిన తర్వాత దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఇది టీ రుచిని పెంచి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
 

ఆకుకూరలు, టమోటాలు

ఆకుకూరలు, టమోటాల కలయిక శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. టమోటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు ఆకుకూరలు తింటే వాటిలో ఉండే ఐరన్ ను గ్రహించడానికి మీ శరీరానికి విటమిన్ సి అవసరం. అందుకే టమోటాలను ఆకుకూరలతో తినడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 

click me!