Crows Story: ఒక కాకి చనిపోతే మిగతా కాకులు అక్కడ ఎందుకు గుమిగూడుతాయి?

Published : Dec 23, 2025, 11:23 AM IST

Crows Story: ఒక కాకి చనిపోతే చాలు వందల కాకులు వచ్చి అక్కడ చేరుతాయి. ఇది సంతాప సభ అనుకుంటారు అందరూ... నిజానికి కాదు. అక్కడ కాకులు చేరి తమ జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్చకుంటాయి. 

PREV
13
కాకి గోల

మన చుట్టూ ఎక్కువగా కనిపించే పక్షి కాకి. కానీ ఒక కాకి చనిపోయినప్పుడు మీరు గమనించే ఉంటారు... చుట్టుపక్కల కాకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరి అరుస్తూనే ఉంటాయి. తోటి కాకి చనిపోతే మిగతా కాకులు ఏడుస్తున్నాయని అనుకుంటారు. కొందరు దీనిని కాకుల అంత్యక్రియలు అని కూడా అంటారు. నిజంగా అవి శోకం పాటించేందుకు వస్తాయనుకుంటారు. శాస్త్రవేత్తలు ఈ విషయం మీద పరిశోధనలు చేశారు. వారు చెప్పిన ప్రకారం ఇది కాకుల భావోద్వేగం కాదు... వాటి జీవన రక్షణకు ఉపయోగపడే పాఠంగా చెప్పుకుంటారు. ఒక కాకి మృతదేహాన్ని చూసిన వెంటనే మరో కాకి గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం విని ఇతర కాకులు అక్కడికి చేరుతాయి. అలా చేరిన కాకులు మృతదేహాన్ని గమనిస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాయి.

23
కాకులు తెలివైన పక్షి

ఇలా ప్రవర్తించడానికి ముఖ్య కారణం ఆ కాకి ఎలా చనిపోయిందో తెలుసుకోవడం కోసం. అలాగే తమకు ఏమైనా ప్రమాదం ఉందో లేదో గుర్తించేందుకు పయత్నిస్తాయి కాకులు. ఆ కాకి ఎలా చనిపోయింది? అనే విషయం తెలుసుకోవటమే వీటి లక్ష్యం. విషపదార్థం తిన్నదా, వేటగాడు దాడి చేశాడా, మనిషి వల్ల ప్రమాదం జరిగిందా అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇలా తెలుసుకున్న సమాచారం భవిష్యత్తులో వాటికి ఉపయోగపడుతుంది. ఒక ప్రాంతం ప్రమాదకరం అని అర్థమైతే ఆ చోటుకు మళ్లీ వెళ్లకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నిస్తాయి. కాకులు చాలా తెలివైన పక్షులు అని శాస్త్రవేత్తలు చెబుతారు. ఇవి ఒకసారి ఎదురైన ప్రమాదాన్ని చాలా కాలం గుర్తుపెట్టుకుంటాయి. ముఖ్యంగా మనుషుల ముఖాలను కూడా గుర్తుంచుకునే శక్తి ఉంటుంది. ఒక మనిషి వల్ల ప్రమాదం జరిగితే ఆ వ్యక్తిని చూసిన వెంటనే హెచ్చరిక శబ్దాలు చేస్తాయి. మరణించినగ్గర చేరే సమయంలో కూడా ఇవి ఒకరికొకరు సమాచారాన్ని పంచుకుంటాయి. ఈ విధంగా ఒక కాకి చనిపోవటం మిగతా కాకులకు పాఠంలా మారుతుంది.

33
సంతాప సభ కాదు

ఈ దృశ్యం చూసినప్పుడు మనుషులు దీనిని సంతాప సభలా భావిస్తారు. కానీ శాస్త్రం చెబుతున్నది వేరే విషయం.అవి కన్నీళ్లు పెట్టి బాధపడటం కాదు. తమ గుంపు భద్రత కోసం నేర్చుకునే పని ఇది. కొద్దిసేపు అక్కడ ఉండి అరుస్తాయి. తరువాత మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఈ సమావేశం సాధారణంగా కొన్ని నిమిషాల నుంచి అరగంట వరకు కొనసాగుతుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి కాకికి ప్రమాదం గురించిన అవగాహన వస్తుంది. మొత్తానికి కాకులు చనిపోయిన తోటి కాకి దగ్గర చేరటం వెనుక లోతైన కారణం ఉంది. ఇది ప్రకృతి ఇచ్చిన జాగ్రత్త వ్యవస్థ. భావోద్వేగాల కన్నా తెలివితేటలు ఎక్కువగా పనిచేసే సందర్భం ఇది. మనం సాధారణంగా చూసి వదిలేసే ఈ సంఘటన వెనుక కాకుల జీవితానికి సంబంధించిన గొప్ప పాఠం దాగి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories