
జెఫరీ ఎపిస్టయిన్ .. అనే పేరు విన్నారా?
ఇతనో బ్రోకర్.
ప్రపంచ కుబేరులకు ఆ సుఖాల్ని అందించడం తన వృత్తిగా పెట్టుకొన్నాడు.
అతనికి లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక సొంత దీవి ఉండేది .
దానికి ఎపిస్టయిన్ దీవి , పీడోఫైల్ దీవి అని పేర్లు కూడా ఉండేవి .
పీడోఫైల్ అంటే ముక్కుపచ్చలారని పసికందుల పట్ల లైంగికంగా ఆకర్షణకు గురయ్యే సైకో లక్షణం.
ఎపిస్టయిన్ కు సొంత బోయింగ్ 727 విమానం ఉండేది.
దానికి లోలిటా ఎక్స్ ప్రెస్ అని కూడా పేరుండేది.
లోలిటా అంటే మగాడి పసివాంఛ తీర్చే చిన్న వయసున్న అమ్మాయి అని అర్థం.
1 . అతడికి ప్రపంచ కుబేరులతో... అధికారం చేతిలో ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు ఉండేవి .
2. ప్రపంచం నలుమూలల నుంచి అందమయిన అమ్మాయిలను నయానో భయానో ఒప్పించి తన దీవికి రవాణా చేసేవాడు. ఈ అమ్మాయిల్లో అధికులు 14 - 15 ఏళ్ళలోపువారే. చాలా మంది పేద కుటుంబాలకు చెందినవారే.
3. ప్రపంచ కుబేరులు లోలిటా ఎక్స్ ప్రెస్ లో అక్కడికి వెళ్లి తమ పశువాంఛ తీర్చుకొనేవారు. ఇందుకు గాను కోట్లు కుమ్మరించేవారు.
4. తన రింగ్ లో చిక్కిన అమ్మాయిల ద్వారా మరింత మందిని ఈ రింగ్ లోకి తెచ్చేవాడు.
5.తన దగ్గర అపార సంపద. అంతే కాకుండా ప్రపంచ కుబేరులు తన కస్టమర్స్ . దానితో అతను ఆడిందే ఆటగా తయారయ్యింది.
పాపం ఎప్పటికైనా పండుతుంది. ఎపిస్టయిన్ 2019 లో అరెస్ట్ అయ్యాడు. అటుపై జైల్లో మరణించాడు.
అతనిది ఆత్మ హత్య అని ప్రచారం. లేదు... తమ రహస్యాలు బయటకు వస్తాయని అతని సంపన్న కస్టమర్లు చంపించారు అని మరో ప్రచారం.
నాలుగు రోజుల క్రితం USA జస్టిస్ డిపార్ట్మెంట్ ఎపిస్టయిన్ ఫైల్స్ పేరుతో ముప్పై లక్షల పేజీల డాక్యుమెంట్ లు .. 2000 వీడియోలు. లక్ష ఎనభై వేల ఫోటో లు బయట పెట్టింది.
ఇందులో ఉన్నదంతా నిజం అని నేను చెప్పడం లేదు.
ఇంత సంచలనం జరిగితే మీడియా లో పెద్దగా వార్తలు రాలేదు.
గేట్ల తాత.. ప్రపంచానికి వాక్ సీన్ ప్రదాతగా పేరుగాంచాడు.
పసి పిల్లలకు సెర్వికల్ కాన్సర్ రాకూడదని వాక్ సీన్ తయారు చేసి.. కోట్లు కుమ్మరించి ఇప్పుడు అందరికీ గుచ్చే పనిలో ఉన్నాడు.. ఇతని గురించి ఇప్పుడు మీడియా, స్వచ్చంద సంస్థలు పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.
ఇతను ఈ దీవి లో ముక్కుపచ్చలారని రష్యన్ బాలికలతో ఆ ఆటలు ఆడుకున్నాడు.. అందువల్ల సుఖ రోగాలు వచ్చాయి. అందువల్ల మందులు కొన్నాడు అని మొన్న డాకుమెంట్స్ వెలికి వచ్చాయి.
మీడియా సైలెన్స్ .
అసలు వార్త కంటే దాన్ని గేట్ల తాత తరపున ఖండించిన వార్తే ప్రముఖంగా వచ్చింది.
ధర్మో రక్షతి రక్షితః అన్నారు .
సత్యాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది .
సత్యానికి మనం పాతర వేస్తె .. నిజం మాట్లాడే వారిపై రాళ్ళేస్తే ..
అమాయక పసి పిల్లల ప్రాణాలకు, మానానికి గ్యారంటీ ఉండదు.
అన్యాయం అక్రమం రాజ్యమేలుతాయి .
నేరగాళ్లు చేల రేగి పోతారు .
ఇంకోసారి చెబుతున్నా.. ఈ వివాదంలో బయటకు వచ్చిన పేర్లన్నీ, అంశాలన్నీ సత్యం అని చెప్పడం లేదు.
ఈ పోస్ట్ లో నా పాయింట్ ఒక్కటే. అన్ని లక్షల పేజీల డాక్యుమెంట్లు .. వీడియోలు, ఫోటోలు బయట పడితే .. కనీసం ముక్క వార్త రాకుండా చర్చ లేకుండా ఎలా తొక్కేసారో చూడండి. డబ్బుంటే తిమ్మిని ఎలా బమ్మిని చేయవచ్చు? అనేది అర్ధం చేసుకోండి . మీడియాలో కన్పించేది .. వినిపించేది ఎంత వరకు నిజాలో .. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు ఈ వ్యవస్థలు... పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్నవారు ఎలాంటి పనులు చేస్తున్నారో ... తెలుసుకోండి.
ఇంకో విషయం... వారం క్రితమే అమెరికా యుద్ధ నౌక ఇరాన్ వెళ్ళింది.. ఇక ప్రచండ యుద్ధమే అన్నారు . ఆ తరువాత అంత బ్లాంక్.
ఆ పాయింట్ ను మీడియా వదిలేసింది.
అంతకు ముందు ఇదిగో గ్రీన్ ల్యాండ్ ఆక్రమణ అన్నారు. ఆ పాయింట్ కూడా పోయింది.
ట్రంప్ ఇదిగో యుద్ధం అని సోమవారాలు లేదా ఆదివారాలు ఒక ప్రకటన ఇస్తాడు. వెంటనే స్టాక్ మార్కెట్ పతనం అవుతుంది. తక్కువ ధరకు ఎవరో షేర్లు కొనేస్తారు.
మళ్ళీ ట్రంప్ సైలెంట్.
వెండి ధరలను మూడు నెలలో రూ.1,55,000 నుంచి నాలుగు లక్షలకు పెంచారు. జనాలు వేలం వెర్రిగా కొన్నారు. అంతలోనే ధర యాభై వేలు పడిపోయింది.
వెండి బంగారు ధరలు ఇంకా పడిపోతాయని మీడియా ప్రచారం.
నీ సంపదను నేరుగా ఇంటికి రాకుండా దోచేసే పధ్ధతి .. ఎప్పటి నుంచే ఉండేదే .. ఇప్పుడు గ్రాండ్ స్కేల్ లో చేసున్నారు. జనాల్ని బకరాలను చేసి అడిస్తున్నారు..!
డిజిటల్ యుగంలో అప సమాచారమే { మిస్ ఇన్ఫర్మ్షన్ }... దోపిడీకి... వంచనకు ఆయుధం .
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగినప్పుడు బోయింగ్ డ్రీం లైనర్ విమానాల గురించి రాస్తే కొంత మంది కయ్యి మన్నారు . ఇప్పుడు మరో మెకానికల్ సమస్య.
నేను ఆ వాక్ సీన్ గురించి రాసాను అని వారం రోజులుగా నా పై కక్ష కట్టి కొంతమంది..
నిజాన్ని నమ్ముకున్నోడిని . భయపడను . వెనకడుగు వెయ్యను.