Worlds Most Expensive Luxury Bus: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బస్సు మార్చి మొబైల్ ఎలిమెంట్ పలాజ్జో. విమానంలాంటి కాక్పిట్, బెడ్రూమ్, టెర్రస్.. ఈ బస్సు ధర తెలిస్తే షాక్ అవుతారు.. కోట్ల విలువ కలిగిన ఈ బస్సు ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
చక్రాలపై రాజమహల్ .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బస్సు ఇదే
ఆస్ట్రియన్ కంపెనీ మార్చి మొబైల్ తయారు చేసిన 40 అడుగుల పొడవున్న మార్చి మొబైల్ ఎలిమెంట్ పలాజ్జో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బస్సుగా గుర్తింపు పొందింది. దీని ధర రూ. 18 కోట్లుగా ఉంది. చక్రాలపై తిరిగే రాజమహల్ అని చెప్పవచ్చు. అలాంటి ఈ బస్సులో ఒక లాంజ్, మాస్టర్ బెడ్రూమ్, ప్రత్యేకంగా టెర్రస్ కూడా ఉండటం దీని ప్రత్యేకత.
25
రాయల్ మాస్టర్ బెడ్రూమ్
ఈ పలాజ్జో బస్సులో రాజులకు తగినట్లుగా ఉండే అద్భుతమైన మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. దీనిలో బ్రిటిష్ స్టైల్ అలంకరణతో కూడిన బెడ్, వెల్వెట్ కవర్లు, సిల్క్ షీట్లు ఉన్నాయి. అంతేకాకుండా దీని పైభాగంలో హ్యాండ్క్రాఫ్ట్ చేసిన ఇరానియన్ సీలింగ్ మిర్రర్ ఉండి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
35
ఒక బటన్ నొక్కితే చాలు.. మీ పర్సనల్ రిట్రీట్ సిద్ధం
40 అడుగుల పొడవున్న ఈ మొబైల్ హోమ్ కేవలం ఒక బటన్ ప్రెస్ చేయగానే వ్యక్తిగత రిట్రీట్లా మారిపోతుంది. దీనిలో పాప్-అప్ కాక్టెయిల్ బార్, ఫ్లోర్ హీటింగ్, ఎక్స్ట్రావగెంట్ మార్బుల్ లైటింగ్, వాటర్ ఫాగ్ సిస్టమ్, ఆన్బోర్డ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
ఈ బస్సులో ఒక ప్రత్యేకమైన స్కై లాంజ్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో మీరు పార్టీలు నిర్వహించుకోవచ్చు. రాత్రి సమయంలో మెరిసే నక్షత్రాల క్రింద కూర్చుని ఒక క్యాన్ బీర్తో ప్రశాంతంగా సేదర తీరడానికి ఈ స్కై లాంజ్ చక్కగా సరిపోతుంది.
55
లగ్జరీతో పాటు అత్యున్నత భద్రత.. డ్రైవర్ కాక్పిట్
ఈ వాహనం భద్రత కోసం సీసీటీవీ సర్వైలెన్స్ సిస్టమ్తో అమర్చారు. బస్సులోకి అడుగుపెట్టకుండానే యజమాని దీన్ని రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. అలాగే ఈ లగ్జరీ బస్సు డ్రైవర్ క్యాబిన్ అచ్చం విమానం కాక్పిట్ లాగా డిజైన్ చేశారు.
దీనిలో లెదర్, అల్కాంటారా మెటీరియల్తో చేసిన ఎయిర్లైన్ స్టైల్ కెప్టెన్ చైర్ ఉంటుంది. ఊహకందని అన్ని రకాల విలాసాలతో కూడిన ఈ ఎలిమెంట్ పలాజ్జో నిజంగానే చక్రాలపై ఉన్న ఒక అద్భుతమైన రాజమహల్ అని చెప్పొచ్చు.