ఉత్తర ధ్రువానికి (North Pole) అత్యంత సమీపంలో ఉన్న ఈ రహదారి పొడవు దాదాపు 129 కిలోమీటర్లు. ఇది నార్వేలోని ఓల్డాఫెవోఓర్డ్ గ్రామాన్ని, నార్డ్‌కాప్ (North Cape) ప్రాంతంతో కలుపుతుంది. ఈ ప్రయాణ మార్గంలో దాదాపు ఐదు సొంగాలు (Tunnels) ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది నార్త్‌కేప్ సొరంగం. ఇది సముద్ర మట్టానికి సుమారు 212 మీటర్ల దిగువన, సముద్రం కింద దాదాపు 6.9 కిలోమీటర్ల పొడవున నిర్మించబడింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కఠినమైన వాతావరణం - నిబంధనలు
ఈ రోడ్డుపై ప్రయాణించడం సామాన్యమైన విషయం కాదు. ఉత్తర ధ్రువ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. శీతాకాలంలోనే కాకుండా వేసవి కాలంలో కూడా ఇక్కడ చలి తీవ్రత అధికంగా ఉంటుంది. బలమైన గాలులు వీయడంతో పాటు భారీగా మంచు కురుస్తుంది.
ఈ భీకరమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడ ప్రయాణించే పర్యాటకులు కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ రహదారిపై ఎవరూ ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతి లేదు. మంచు తుఫానుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు వాహనాలను కాన్వాయ్‌లుగా నడుపుతారు.