Tradition: అంత్య‌క్రియ‌ల్లో కుండ‌ను ఎందుకు బ‌ద్ద‌లుకొడ‌తారు.? రంధ్రాలు ఎందుకు పెడ‌తారు.?

Published : Dec 30, 2025, 01:58 PM IST

Tradition: హిందూ ధ‌ర్మంలో ప్రతీ ఒక్క ఆచారానికి ఒక అంత‌రార్థం ఉంటుంది. పుట్టుక నుంచి చావు వ‌ర‌కు కొన్ని విధానాల‌ను పాటిస్తుంటారు. మ‌నిషి చ‌నిపోయిన త‌ర్వాత చేసే అంత్య‌క్రియ‌ల్లో కూడా ప‌లు విధానాలు ఉంటాయి. వాటిలో ఒక ఆచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
అంత్యక్రియలకు ఎంతో ప్రాధాన్య‌త‌

మన సంప్రదాయాల్లో అంత్యక్రియలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితం ముగిసిన తర్వాత చేసే చివరి కార్యాన్ని అంత్యక్రియలుగా భావిస్తారు. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు. జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం గురించి మన పెద్దలు ఇచ్చిన సంకేతాలు కూడా. స్మ‌శానంలో జరిగే ప్రతి చిన్న చర్యకు ఒక అర్థం ఉంటుంది. అందులో ముఖ్యమైనది కుండతో చేసే కర్మ.

25
శరీరం–ఆత్మ భావన

హిందూ తత్వంలో మనిషి రెండు భాగాల సమాహారం. ఒకటి శరీరం. ఇంకొకటి ఆత్మ. మనిషి బతికే సమయంలో ఈ రెండూ కలిసే ఉంటాయి. మరణం తర్వాత శరీరం చలనం కోల్పోతుంది. ఆత్మ మాత్రం ప్రయాణం మొదలుపెడుతుందని విశ్వాసం. శరీరంపై ఉన్న అనుబంధం వల్ల ఆత్మ కొంతకాలం దానిని విడిచిపెట్టదని నమ్మకం ఉంది. అందుకే దహనం ద్వారా శరీర బంధం పూర్తిగా తెగిపోతుందని భావిస్తారు.

35
దింపుడుగల్లం అంటే ఏంటి.?

శవయాత్రలో భాగంగా స్మ‌శాన‌వాటిక‌కు చేరుకునే ముందు పాడెను కాసేపు దించుతారు. దీనిని దింపుడుగల్లం అంటారు. ఆ సమయంలో కొంత బియ్యం నేలపై చల్లుతారు. ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడమే ఈ కర్మ ఉద్దేశం అని శాస్త్రాలు చెబుతాయి. ఆత్మ ఆ బియ్యం గింజలను లెక్కపెట్టడంలో తలమునకలై తిరిగి ఇంటి వైపు రాకుండా ఉంటుందని నమ్మకం. అలాగే చెవిలో పిలవడం ద్వారా ఆత్మ ఇంకా శరీరంలో ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తారని చెబుతారు.

45
కుండకు రంధ్రాలు పెట్టి ఎందుకు తిరుగుతారు?

చితి దగ్గర చేసే కర్మల్లో కుండకు చాలా ప్రాధాన్యం ఉంది. కుండ శరీరానికి ప్రతీక. అందులోని నీరు ఆత్మకు సంకేతం. చితి చుట్టూ తిరుగుతూ కుండకు రంధ్రాలు చేస్తారు. ఆ రంధ్రాల నుంచి నీరు మెల్లగా కారుతుంది. ఇది ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లే ప్రక్రియకు సూచనగా భావిస్తారు. ఒక్కసారిగా కాదు. నెమ్మదిగా విడిపోవాలనే భావన ఇందులో దాగి ఉంది.

55
కుండను పగలగొట్టడంలో శాస్త్రీయ భావన

చివరగా కుండను పగలగొడతారు. దీని అర్థం శరీర బంధం పూర్తిగా ముగిసింది అనే సంకేతం. ఇక నీకు శరీరంతో సంబంధం లేదు అని ఆత్మకు తెలియజేయడం ఇదే. మరోవైపు దీనికి ఒక శాస్త్రీయ‌ కారణం కూడా ఉంది. చితి చుట్టూ నీరు చల్లడం వల్ల మంటలు అదుపులో ఉంటాయి. చుట్టుపక్కల పొదలు అంటుకోకుండా నివారించవచ్చు. పెద్దలు ఆచారంతో పాటు భద్రతను కూడా ఇందులో కలిపారు. అందుకే ఈ కర్మను ఇప్పటికీ పాటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories