Smallest Train in India : చేయి ఎత్తితే ఆగే రైలు.. ఇవే దేశంలో అతిచిన్న రైళ్లు

Published : Dec 30, 2025, 01:19 PM IST

Smallest Train in India : భారతదేశంలో అతి చిన్న రైలు ఏది..? ఇదే అతి తక్కువ దూరం, అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు కూడా. చేయి ఎత్తితే ఆగే స్థాయిలో దీని స్పీడ్ ఉంటుందట.  

PREV
15
Smallest Train in India

Smallest Train in India : ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాల్లో ఇండియా ఒకటి. బ్రిటిష్ పాలనలో ప్రారంభమైన రైల్వే ప్రయాణం స్వతంత్ర భారతంలోనూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుతాల చేస్తోంది ఇండియన్ రైల్వే... ఇప్పటికే వచ్చిన వందే భారత్, త్వరలోనే రాబోతున్న బుల్లెట్ ట్రైన్స్ ఇందుకు నిదర్శనం. అయితే ఇలా అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన భారతీయ రైల్వే అతి చిన్న ట్రైన్స్ ను కలిగివుంది... ఇలాంటివాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
ఇండియాలో అతి చిన్న రైలు..?

భారతదేశంలో వేల కిలోమీటర్లు నడిచే రైళ్లు అనేకం ఉన్నాయి... ఇవి నిత్యం లక్షలాదిమందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. కానీ కేవలం 9 కిలోమీటర్ల దూరం మాత్రమే నడిచే రైలు కూడా ఉంది.. అది కేవలం మూడు బోగీలతోనే ప్రయాణిస్తుంది. ఇలా అతి తక్కువ దూరం.. అతి తక్కువ ప్రయాణికులతో నడిచే అతిచిన్న రైలు DEMU (Diesel Electric Multiple Unit) కేరళలో ఉంది.

కేరళలోని కొచ్చి హార్బర్ టెర్మినస్ నుండి ఎర్నాకులం జంక్షన్ వరకు ఈ డెము రైలు నడుస్తుంది. ఇది కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది... మధ్యలో కేవలం ఒకే ఒక్క స్టాప్ ఉంటుంది. 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తిచేస్తుంది... ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులు ఈ ట్రైన్ నడుస్తుంది. మూడు బోగీలు కలిగిన ఈ ట్రైన్ 300 సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది.

35
ఐత్ కోంచ్ షటిల్ ట్రైన్

ఉత్తర ప్రదేశ్ లో కూడా అతి చిన్న రైలు ఒకటి బ్రిటిష్ కాలంలో ప్రారంభమే ఇప్పటికీ కొనసాగుతోంది... అదే ఐత్ కోంచ్ షటిల్ ఎక్స్ ప్రెస్ స్పెషల్. ఇది బుందేల్ ఖండ్ లోని గిరిజన ప్రాంతాల్లో నడిచే రైలు... కేవలం 13 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం. ఈ రైలు కేవలం మూడు బోగీలు మాత్రమే కలిగి ఉంటుంది... ప్రతిరోజు నాలుగైదు సార్లు ఐత్(Ait)-కోంచ్(Konch) మధ్య రాకపోకలు సాగిస్తుంటుంది... వందల మంది ఇందులో ప్రయాణిస్తుంటారు.

ఇది అన్ రిజర్వుడ్ ట్రైన్... అంటే ఇందులో టికెట్ రిజర్వేషన్ ఉండదన్నమాట. టికెట్ కేవలం రూ.5 మాత్రమే. ఇందులో ప్రయాణించే ప్రతిఒక్కరు టికెట్ తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రైలు గంటకు కేవలం 20 నుండి 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంటుంది.. కాబట్టి బస్సు మాదిరిగా ఎక్కడ చేయి ఎత్తితే అక్కడ ఆగుతుందని స్థానికులు చెబుతుంటారు. అందుకే కేవలం 13 కి.మీ దూరాన్ని 30-35 నిమిషాల్లో ప్రయాణిస్తుంది.

45
నీలగిరి మౌంటెన్ రైల్వే

తమిళనాడులోని నీలగిరి మౌంటెన్ రైల్వేలో కూడా ఇలాంటి అతిచిన్న రైలు ఉంది. మెట్టుపాలయం-ఊటీ ప్యాసింజర్ ట్రైన్ ఐదు గంటల్లో కేవలం 46 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే సగటున 9 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందన్నమాట. అందుకే దీన్ని సరదాగా టాయ్ ట్రైన్ అనికూడా పిలుస్తారు. కొన్నిచోట్ల ఈ రైలు సైకిల్ కంటే స్లో అవుతుంది. ఊటీ అందాలతో పర్యాటకులకు కనువిందు చేస్తూ ఈ రైలు కొండలు, అడవులు, జతపాతాలు, తేయాకు తోటలను దాటుకుంటూ స్లోగా ముందుకు సాగుతుంది. కేవలం కొద్దిమంది పర్యాటకులతో మాత్రమే ఈ రైలు ప్రయాణం సాగుతుంది.

55
అతి పొడవైన రైలు ఏది?

భారతదేశంలో అతి పొడవైన రైలు 'రుద్రాస్త్ర'.. ఇది ప్యాసింజర్ ట్రైన్ కాదు సరుకు రవాణాకోసం ఉపయోగించేది. ఈ గూడ్స్ ట్రైన్ పొడవు ఏకంగా 4.5 కిలోమీటర్లు... ఏడు ఇంజన్లు, 354 వ్యాగన్లు కలిగి ఉంది. తూర్పు మధ్య రైల్వే పరిధిలోని గంజ్ కవాజా స్టేషన్ నుండి గర్హ్వా రోడ్ స్టేషన్ వరకు ఈ ఏడాది విజయవంతంగా ప్రయాణించింది ఈ గూడ్స్ ట్రైన్.

Read more Photos on
click me!

Recommended Stories