Motivational story: అన్నింటికంటే విలువైంది మనిషి నమ్మకం అని చెబుతుంటారు. మనల్ని నమ్మిన వారిని మోసం చేయకూడదుని చెబుతుంటారు. అయితే నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పే ఓ నీతి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకానొక అడవిలో కాకి, చిలక ఉండేవి. చిలక తన పిల్లలతో ఇంట్లో నివసించేది. కాకి మాత్రం సొంతిళ్లు లేక చెట్టుపై గూడు కట్టుకుని ఉండేది. కాకికి కూడా ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉండేది. అయితే ఇంటిని నిర్మించుకునే స్థోమత ఉండదు, అందుకోసం ఏ రోజు కష్టం కూడా చేసేది కాదు.
25
భారీ వర్షానికి కూలిన చెట్టు
ఒకరోజు భయంకరంగా వర్షం కురిసింది. ఆ వర్షానికి కాకి నివసిస్తున్న చెట్టు పూర్తిగా కూలిపోయింది. దీంతో వర్షంలో తడిసిపోయిన కాకికి ఎటు వెళ్లాలో తెలియదు. అప్పుడే చిలక గుర్తొస్తుంది. వెంటనే చిలక ఇంటికి వెళ్లి జరిగింది చెబుతుంది.
35
చిలక మంచి మనసు
వర్షం కారణంగా తాను నివసిస్తున్న చెట్టు కూలిపోయిందని, దయచేసి ఈ రోజు రాత్రికి ఆశ్రయం కల్పించమని కాకి, చిలకను కోరుతుంది. దీంతో కాకిని ఇంట్లోని ఆహ్వానిస్తుంది చిలక. తడిసి వచ్చిన కాకికి టవల్ ఇచ్చి వేడి వేడి భోజనం పెట్టి. పడుకోమని గదిని చూపిస్తుంది.
చిలక ఇంటిని మొత్తం చూసిన కాకికి ఒక్కసారిగా దురాశ పుడుతుంది. ఇంత మంది ఇల్లు తనకు కూడా ఉంటే బాగుటుందని అనుకుంటుంది. చిలకను వాటి పిల్లల్ని చంపేస్తే ఆ ఇల్లును తనకే అవుతుందని దుర్భుద్ధి పుడుతుంది. చిలక పిల్లలను చంపేందుకు ప్రయత్నిస్తుంది. అంతలోనే ఆ చిన్న చిలకలు అరవడం మొదలు పెడాయి.
55
కాకికి తగిన శిక్ష
కాకి అసలు రూపం చూసిన చిలక అరవడం మొదలు పెడుతుంది. నమ్మి ఆశ్రయం కల్పిస్తే మమ్మల్నే చంపాలని చూస్తావా.? నీలాంటి వారికి సహాయం చేయడం కూడా పాపమే అని ఆ రాత్రే ఇంటి నుంచి బయటకు నెట్టేస్తుంది. ఆ రాత్రంతా వర్షంలో తడుస్తూ, చలిలోనే గడుపుతుంది కాకి.
కథ చెప్పే నీతి
చిన్నదే అయినా ఈ కథ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నమ్మకాన్ని దుర్వినియోగం చేసినవారికి చివరకు శిక్ష తప్పదని చాటి చెబుతోంది. దురాశ జీవితాన్ని నాశనం చేస్తుందనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తోంది.