Sugar: 10 కిలోల చెరకు నుంచి ఎన్ని కేజీల చక్కెర వస్తుంది? అసలు చక్కెర ఎలా తయారవుతుంది?

Published : Nov 26, 2026, 01:37 PM IST

Sugar: మనం రోజూ ఉదయాన్నే తాగే టీ దగ్గరి నుంచి ఇష్టంగా తినే స్వీట్ల వరకు అన్నింట్లో చక్కెర ఉండాల్సిందే. చెరకు నుంచి చక్కెర తయారవుతుందని మనకు తెలుసు. కానీ 10 కిలోల చెరకు నుంచి ఎంత చక్కెర తయారవుతుంది? అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.

PREV
15
చక్కెర తయారీ గురించి ఆసక్తికర విషయాలు

సాధారణంగా చక్కెర, చెరకు రసాన్ని మనం రెగ్యులర్ గా తీసుకుంటూనే ఉంటాం. అయితే పది కేజీల చెరకు నుంచి ఎంత చక్కెర తయారవుతుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి చెరకు రకం, పండిన స్థాయి, సాగు పరిస్థితులను బట్టి చక్కెర శాతం మారుతూ ఉంటుంది. సాధారణంగా చెరకులో సుమారు 10 నుంచి 16 శాతం వరకు సుక్రోజ్ ఉంటుంది. అయితే చెరకులో ఉన్న మొత్తం చక్కెర అంతా మనకు నేరుగా చక్కెర రూపంలో లభించదు. ఎందుకంటే చెరకులో నీరు, పీచు పదార్థం, ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. చెరకును ఫ్యాక్టరీకి తీసుకెళ్లిన తర్వాత దాని నుంచి రసాన్ని తీసి, శుద్ధి చేసి, మరిగించి, స్ఫటికాలుగా మార్చిన తర్వాతే మనం చక్కెర లభిస్తుంది.

25
10 కిలోల చెరకు నుంచి ఎంత చక్కెర వస్తుంది?

సాధారణంగా 10 కిలోల చెరకు నుంచి సుమారుగా 700 గ్రాముల నుంచి 1.2 కిలోల వరకు చక్కెర లభించే అవకాశం ఉంటుంది. అయితే అన్ని రకాల చెరకుకు ఇంతే వస్తుందని చెప్పలేము. కొన్ని రకాల చెరకులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే మరికొన్నింటిలో తక్కువగా ఉంటుంది. అలాగే చెరకు ఎంత తాజాగా ఉంది, దానిలోని రసాన్ని ఎంత సమర్థంగా తీస్తున్నారు అనే అంశాలు కూడా చక్కెర దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి.

35
చక్కెర ఎలా తయారవుతుంది?

రైతులు పండించిన చెరకును చక్కెర ఫ్యాక్టరీలకు తీసుకెళ్తారు. అక్కడ చెరకును శుభ్రం చేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. అనంతరం ప్రత్యేకమైన యంత్రాల సహాయంతో చెరకు నుంచి రసాన్ని బయటకు తీస్తారు. ఈ ప్రక్రియలో చెరకు పీచు వేరు అవుతుంది. మిగిలిన చెరకు రసాన్ని తర్వాత దశలకు పంపిస్తారు. ఈ రసంలో చక్కెరతో పాటు మట్టి, పీచు అవశేషాలు, ఇతర మలినాలు కూడా ఉంటాయి.

45
శుద్ది ప్రక్రియ ఎలా ఉంటుందంటే?

తర్వాత చెరకు రసాన్ని శుద్ధి చేస్తారు. రసంలోని మలినాలను తొలగించడానికి ఫ్యాక్టరీల్లో ప్రత్యేకమైన శుద్ధి ప్రక్రియను ఫాలో అవుతారు. ఇలా శుద్ధి చేసిన రసాన్ని వడపోసి మరింత స్వచ్ఛంగా తయారు చేస్తారు. ఈ దశలో రసంలోని అనవసరమైన పదార్థాలు తొలగిపోయి, చక్కెర కలిగిన ద్రవం మిగులుతుంది.

55
యంత్రాల సహాయంతో..

ఆ తర్వాత ఈ శుద్ధి చేసిన చెరకు రసాన్ని పెద్ద పెద్ద బాయిలర్లలో వేడి చేస్తారు. వేడి చేయడం వల్ల అందులోని నీరు క్రమంగా ఆవిరైపోతుంది. దీంతో రసం చిక్కటి పాకంలా మారుతుంది. ఈ పాకాన్ని మరింత ప్రాసెస్ చేసి, చక్కెర స్ఫటికాలు ఏర్పడేలా చేస్తారు. అనంతరం ప్రత్యేక యంత్రాల సహాయంతో స్ఫటికాలను మిగిలిన ద్రవం నుంచి వేరు చేస్తారు. ఇలా వేరుచేసిన చక్కెర స్ఫటికాలను ఎండబెట్టి, అవసరమైన నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్యాకింగ్ చేస్తారు. అలా మన ఇళ్లలో ఉపయోగించే చక్కెర తయారవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories