Highway Bords: హైవేల‌పై బోర్డులు గ్రీన్ క‌ల‌ర్‌లోనే ఎందుకుంటాయి? అస‌లు లాజిక్ ఏంటంటే..

Published : Oct 08, 2025, 03:55 PM IST

highway sign boards, green road signs, highway color code, traffic sign colors, why green boards on highways, road safety India, highway psychology, High way Bords 

PREV
15
హైవేల్లో గ్రీన్ బోర్డులు ఎందుకు?

హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి చోటా ఆకుపచ్చ రంగు బోర్డులు కనిపిస్తాయి. నగర పేర్లు, దూరాలు, దిశలు – అన్నీ ఆ రంగులోనే ఉంటాయి. కానీ ఈ రంగును యాదృచ్ఛికంగా ఎంచుకోలేదు. దానికి శాస్త్రీయ, మానసిక కారణాలు ఉన్నాయి.

25
కళ్లకు సౌకర్యమైన రంగు

ఆకుపచ్చ రంగు మానవ కంటికి ప్రశాంతతను ఇస్తుంది. దీన్ని చూసినా కళ్లకు ఒత్తిడి ఉండదు. డ్రైవర్లు గంటల తరబడి రోడ్డుపై ప్రయాణించే సమయంలో అలసట లేకుండా దృష్టి నిలుపుకోవడానికి ఈ రంగు ఉపయోగపడుతుంది.

35
ఎరుపు, పసుపు ఎందుకు ఉప‌యోగించ‌రంటే.?

ఎరుపు, పసుపు రంగులు వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. అవి హెచ్చరికలు, ప్రమాద సూచనలకు ఉప‌యోగిస్తారు. అయితే డైరెక్ష‌న్స్‌, ప్ర‌దేశాల పేర్ల‌కు ఉప‌యోగించే బోర్డులు ఎక్కువ సాంధ్ర‌త ఉన్న క‌ల‌ర్స్‌తో ఉండ‌కూడ‌దు. అందుకే వీటికి గ్రీన్ క‌ల‌ర్‌ను ఉప‌యోగిస్తుంటారు.

45
శాస్త్రీయ కారణం

మానవ కంటికి కనిపించే వర్ణపటంలో ఆకుపచ్చ రంగు మధ్యలో ఉంటుంది. కాబట్టి అది తక్కువ కాంతిలోనూ, వర్షం కురుస్తున్న‌ సమయంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో డ్రైవర్‌కు బోర్డు స్పష్టంగా చదవడానికి సులభం అవుతుంది.

55
ప్రపంచమంతా ఇదే విధానం

ఒక్క భారతదేశం మాత్రమే కాదు, అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాల్లో కూడా హైవే బోర్డులు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. డ్రైవర్లు వేగంగా ప్రయాణిస్తూనే సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకునేలా ఈ రంగును ఉపయోగిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories