Interesting Facts: మనకు గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి? ఆ టైంలో శరీరంలో ఏం జరుగుతుంది?

Published : Aug 13, 2026, 04:19 PM IST

Interesting Facts: సాధారణంగా కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చేతులపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ఇది చలి వల్ల శరీరం ఇచ్చే స్పందన మాత్రమే కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

PREV
15
గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి?

సాధారణంగా చలిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా శరీరంపై చిన్న చిన్న పొక్కుల్లా కనిపించడం, భయపడినప్పుడు లేదా ఉత్కంఠ కలిగించే సందర్భంలో చేతులపై రోమాలు నిక్కబొడుచుకోవడం చాలామందికి అనుభవమే. దీన్నే ‘గూస్‌బంప్స్’ అంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చలిలో మాత్రమే కాదు, ఒక మంచి పాట విన్నప్పుడు, భావోద్వేగానికి లోనైనప్పుడు, భయపడినప్పుడు, ఒక్కసారిగా ఉత్సాహం కలిగినప్పుడు కూడా కొంతమందికి గూస్‌బంప్స్ వస్తాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

25
కండరాల సంకోచం వల్ల..

గూస్‌బంప్స్ అనేది మన శరీరం కొన్ని పరిస్థితులకు స్పందించే సహజమైన ప్రతిచర్య. మన చర్మంపై ఉన్న ప్రతి వెంట్రుకకు దగ్గరగా చాలా చిన్న కండరాలు ఉంటాయి. చలి, భయం, ఉత్సాహం లేదా కొన్ని బలమైన భావోద్వేగాల సమయంలో ఈ కండరాలు సంకోచిస్తాయి. దాంతో చర్మంపై ఉన్న వెంట్రుకలు నిటారుగా నిలబడతాయి. వాటి చుట్టూ ఉన్న చర్మం కూడా పైకి లేచినట్లు కనిపించడంతో మనకు గూస్‌బంప్స్ వచ్చినట్లు అనిపిస్తుంది.

పరిణామ క్రమంతో సంబంధం..

శరీరం ఇలా స్పందించడానికి మన పరిణామ క్రమంతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పూర్వీకుల శరీరంపై నేటి కంటే చాలా ఎక్కువగా రోమాలు ఉండేవి. చలిగా ఉన్నప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం వల్ల వాటి మధ్య గాలి పొర ఏర్పడి శరీరానికి కొంత వెచ్చదనం అందేది. అంటే గూస్‌బంప్స్ ఒకప్పుడు శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడంలో కొంత ఉపయోగపడే ప్రక్రియగా ఉండేది. నేటి కాలంలో శరీరంపై అంతగా రోమాలు లేకపోవడంతో ఆ ప్రయోజనం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఆ సహజ ప్రతిచర్య మాత్రం ఇప్పటికీ మనలో కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

35
భయం, ఒత్తిడి వల్ల కూడా..

గూస్‌బంప్స్‌కు మరో ముఖ్యమైన కారణం భయం లేదా అకస్మాత్తుగా వచ్చే ఒత్తిడి. మనం ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు శరీరం వెంటనే అప్రమత్తమవుతుంది. ఈ సమయంలో ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ అనే సహజ ప్రతిస్పందనలో భాగంగా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చురుకుగా పనిచేస్తుంది. దానివల్ల గుండె వేగం, శ్వాస, అప్రమత్తత వంటి శరీర ప్రతిస్పందనల్లో మార్పులు రావచ్చు. అదే సమయంలో వెంట్రుకల దగ్గర ఉన్న చిన్న కండరాలు కూడా సంకోచించడంతో గూస్‌బంప్స్ ఏర్పడతాయి.

45
బలమైన భావోద్వేగం కలిగినప్పుడు

అంతేకాదు మనకు చాలా బలమైన భావోద్వేగం కలిగినప్పుడు కూడా గూస్ బంప్స్ రావచ్చు. మనకు ఎంతో ఇష్టమైన పాట వింటున్నప్పుడు, ఒక అద్భుతమైన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు లేదా చాలా ఎమోషనల్ సన్నివేశాన్ని చూసినప్పుడు ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకోవచ్చు. నిపుణుల ప్రకారం సంగీతం లేదా కళ మనలో బలమైన భావోద్వేగాన్ని కలిగించినప్పుడు మెదడు, నాడీ వ్యవస్థ స్పందించడం వల్ల శరీరంలో ఇలాంటి అనుభూతులు కలుగుతాయట.

55
చలి ఎక్కువగా ఉన్నప్పుడు

చలి ఎక్కువగా ఉన్నప్పుడు గూస్‌బంప్స్ రావడం చాలా సాధారణం. మన శరీరం ఉష్ణోగ్రతను ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. బయట ఉష్ణోగ్రత తగ్గినప్పుడు శరీరం వేడిని నిలుపుకోవడానికి వివిధ మార్గాల్లో స్పందిస్తుంది. అందులో ఒకటే రోమాలు నిక్కబొడుచుకోవడం. అలాగే ఆశ్చర్యం, ఉత్సాహం, కోపం, ఉద్వేగం వంటి భావోద్వేగాలు కూడా గూస్‌బంప్స్‌కు కారణం కావచ్చు. ఒక ముఖ్యమైన వార్త వినడం, చాలా కాలం తర్వాత ఇష్టమైన వ్యక్తిని కలవడం లేదా అనూహ్యమైన సంఘటన ఎదురవడం వంటి సందర్భాల్లో కూడా కొందరికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాబట్టి గూస్‌బంప్స్ అనేవి కేవలం చలికి శరీరం ఇచ్చే ప్రతిస్పందన మాత్రమే కాదు.. మన శరీరం, మెదడు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని కూడా ఇవి సూచిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories