Fish: నదిలో పుట్టి.. సముద్రంలో పెరిగి, చావు కోసం మళ్లీ పుట్టిన నదికే వచ్చే చేప ఇది..!

Published : Oct 09, 2026, 03:02 PM IST

Fish: నదిలోనే పుడుతుంది. కానీ, తన ఎదుగుదల కోసం సముద్రంలోకి అడుగుపెడుతుంది. కానీ, తన జీవిత చరమాంకంలో... చనిపోతాను అని డిసైడ్ అయిన తర్వాత... ఏ నదిలో పుట్టిందో.. అదే నదికి తిరిగి వచ్చేస్తుంది. ఆ చేప ఏదో తెలుసా?

PREV
13
పుట్టిన నదిపై ప్రేమ..

మనిషి ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగినా కూడా మాతృభూమిపై ఉన్న ప్రేమ మాత్రం చావదు. ఎప్పటికైనా మళ్లీ పుట్టిన ఊరికి వచ్చేయాలి, అక్కడే స్థిరపడాలి అని కోరుకుంటారు. అచ్చం ఇలానే... ఓ చేప కూడా ప్రవర్తిస్తుందని మీకు తెలుసా? ఆ చేప పుట్టేది నదిలోనే.. కానీ.. ఆహారం కోసం సముద్రానికి వెళ్లిపోతుంది. కానీ.. మళ్లీ తాను పిల్లలు పెట్టాలి అనుకున్నప్పుడు తిరిగి నదిలోనే పెడుతుంది. ఆ తర్వాత.. నదిలోనే తన ప్రాణాలను వదిలేస్తుంది. కేవలం తన పిల్లలు నదిలోనే పుట్టాలి.. తన ప్రాణాలు కూడా నదిలోనే వదిలాలి అనుకొని.. వేల కిలోమీటర్లు ఈదుకుంటూ తాను పుట్టిన నదికి వచ్చి చేరుకుంటుంది. అదే సాల్మన్ చేప. ఈ చేప ఇలా ప్రవర్తించడం వెనక కారణం ఏంటి?

23
నదిలో జననం.. సముద్రంలో గమ్యం..

సాల్మన్ చేపల ప్రయాణం మంచి నీటితోనే ప్రారంభం అవుతుంది. ఆడ చేప నదిలోని గులక రాళ్ల మధ్య చిన్న గూడు లాంటి ప్రాంతంలో గుడ్లు పెట్టగా, మగ చేప వాటిని ఫలదీకరణం చేస్తుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు కొంతకాలం నదిలోనే పెరిగి, ఆ తర్వాత.. సముద్రం వైపు ప్రయాణిస్తాయి. సముద్రంలో సమృద్ధిగా ఆహారం లభిస్తుంది. కాబట్టి.. ఆ ఆహారం తీసుకొని ఇవి చాలా పెద్దదిగా ఎదుగుతాయి. అక్కడే పరిపక్వత చెంది.. సంతానోత్పత్తికి సిద్ధమౌతాయి.

వేల కిలోమీటర్లు ప్రయాణించినా.. పుట్టిన నదిని ఎలా మర్చిపోదు..?

సాల్మన్ చేపల్లో ఒక వింత లక్షణం ఉంటుంది. హోమింగ్ ఇన్ స్టింక్ట్ అనే లక్షణం ఉంటే.. అంటే.. ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా.. ఈ చేపలకు తాము వచ్చిన దారిని మర్చిపోవు. గుర్తుంచుకుంటాయి. సముద్రంలో ఏళ్లపాటు వేల కిలోమీటర్లు తిరిగినప్పటికీ, గుడ్లు పెట్టే సమయానికి అవి తాము పుట్టిన నది వైపు కచ్చితంగా తిరిగి వస్తాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, సాల్మన్ చేపలు చిన్నప్పుడు తాను ఉన్న నదిలోని ప్రత్యేకమైన వాసనలను అద్భుతంగా గుర్తుంచుకుంటాయి. సముద్రం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ వాసనల జ్ఞాపకశక్తి , పర్యావరణ సంకేతాల ఆధారంగా తమ పుట్టిన ప్రదేశాన్ని సరిగ్గా చేరుకుంటాయి.

33
గుడ్లు పెట్టిన వెంటనే ప్రాణాలు వదిలేసే చేప..

ఇది సాల్మన్ జీవితంలోని అత్యంత విషాదకరమైన అలాగే ఆసక్తికరమైన కోణం. పసిఫిక్ సాల్మన్ జాతుల్లో ఎక్కువ భాగం జీవితంలో ఒక్కసారే సంతానోత్పత్తి చేస్తాయి. గుడ్లు పెట్టేందుకు నదిలోకి తిరిగొచ్చే క్రమంలో అవి బలమైన నీటి ప్రవాహాలకు ఎదురీదాల్సి ఉంటుంది. కొన్నిసార్లు భారీ జలపాతాలను కూడా దాటాల్సి రావడంతో విపరీతమైన శారీరక శ్రమ ఖర్చవుతుంది. మంచినీటిలోకి ప్రవేశించిన తర్వాత ఇవి పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తాయి. గూడు తవ్వడం, ప్రయాణం ,సంతానోత్పత్తి కారణంగా శరీరంలోని ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి... గుడ్లు పెట్టిన కొద్ది రోజుల్లోనే చనిపోతాయి.

మరణంలోనూ ప్రకృతికి సహాయం చేసే చేప..

సాల్మన్ చేపల మరణంతో వాటి జీవితం ముగిసినప్పటికీ, ప్రకృతికి వాటి వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. చనిపోయిన వాటి కళేబరాలు కుళ్లిపోవడం ద్వారా నదిలోకి అవసరమైన పోషకాలు విడుదలవుతాయి. అంతేకాకుండా ఇవి నదీ ప్రాంతంలోని ఇతర జంతువులకు కూడా ఆహారంగా మారుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories