క్రికెట్ మొదట టెస్ట్ మ్యాచ్గానే పుట్టింది. మొదట్లో టెస్టు మ్యాచులు మాత్రమే ఉండేది. తరువాత వన్డేలు, టీ20లు పుట్టుకొచ్చాయి. టెస్టు మ్యాచుల్లో అన్ని దేశాల ఆటగాళ్లు వైట్ డ్రెస్ వేసుకుని ఆడటం మీరు చూసే ఉంటారు. వన్డేలు, టీ20ల్లో కలర్ ఫుల్ జెర్సీలు వేసుకునే ప్లేయర్స్.. టెస్టులకు మాత్రం వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారనే ఆసక్తి ఎంతో మందిలో ఉంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
టెస్ట్ క్రికెట్ అనేది 5 రోజుల పాటు జరిగే సుదీర్ఘమైన ఆట. ఇంగ్లండ్లో క్రికెట్ పుట్టినప్పుడు, ఆటగాళ్లు ఎండలో రోజుల తరబడి మైదానంలో నిలబడాల్సి వచ్చేది. సైన్స్ ప్రకారం, తెలుపు రంగు సూర్యరశ్మిని గ్రహించకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఆటగాళ్లకు చెమట పట్టకుండా, శరీరం చల్లగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది