Viral Video: అస‌లు ఈ ఐడియా ఎలా వ‌చ్చింద‌న్న.. ఇలా అయితే గీజ‌ర్ కంపెనీల‌న్నీ మూత‌ప‌డాల్సిందే

Published : Dec 10, 2025, 07:14 PM IST

Viral Video: సోషల్ మీడియాలో ప్రతీరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో మెజారిటీ వాటా ఫన్నీ వీడియోలదే ఉంటుంది. తాజాగా ట్విట్టర్ లో ఇలాంటి ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో అంత‌లా ఏముందంటే..  

PREV
15
వైర‌ల్ అవుతోన్న వీడియో

డిజిటల్ ప్రపంచం అందుబాటులోకి వచ్చిన తర్వాత రోజూ వందల వీడియోలు మనకు కనిపిస్తాయి. వాటిల్లో కొన్ని మనుషుల ట్యాలెంట్ చూసి ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఏ పని కోసం అయినా కొత్త మార్గం కనుక్కుంటే ఆ ఐడియా ఒక్కసారిగా వైరల్ అవుతుంది. తాజాగా అలాంటిదే ఒక వీడియో నెట్టింట చర్చనీయాంశమైంది.

25
గీజర్ లేకపోయినా హాట్ వాటర్ స్నానం

చలికాలం ప్రారంభమైతే వేడి నీరు అందరికీ అవసరం. దీంతో కొందరు వాట‌ర్ హీట‌ర్ల‌ను ఉప‌యోగిస్తే మ‌రికొంద‌రు గీజ‌ర్ల‌ను వాడుతారు. అయితే గీజ‌ర్లు ఉప‌యోగించ‌డం అంద‌రికీ సాధ్యం కాదు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఓ వ్యక్తి ఇంప్రోవైజ్డ్ హీట్ సెటప్ రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియోను @DashrathDhange4 అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు.

35
ఖాళీ నూనె డబ్బాతో హీటర్ తయారీ

వీడియోలో కనిపించిన విధంగా.. బాత్రూమ్ కుళాయి నుంచి పడే నీటికి కింద ఖాళీ టిన్‌ను ఉంచాడు. టిన్ దిగువన చిన్న పాన్‌లో మంట వెలిగించాడు. కుళాయి నుంచి పడే నీరు టిన్‌లో చేరగానే, ఆ మంట వేడి అందించి నీరు హీట్ అవుతుంది.

45
పైప్ ద్వారా నేరుగా హాట్ షవర్

టిన్‌కు ఓ వైపు అమర్చిన పైప్ ద్వారా వేడి నీరు నేరుగా బయటికి వస్తుంది. దీన్ని చూసిన వారందరూ హాట్ షవర్ లాగా పని చేస్తుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలాంటి కరెంట్ ఖర్చు లేకుండా ఇలా హాట్ బాత్ ఏర్పాటు చేసేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

55
సోషల్ మీడియాలో ఫన్నీ రియాక్షన్లు

ఈ వీడియోను ఇలా పోస్ట్ చేశారో లేదో వైర‌ల్ అయ్యింది. లక్ష‌ల్లో వ్యూస్, వేల‌ల్లో కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. వింట‌ర్ స్నానానికి ఇదొక బెస్ట్ ట్రిక్ అని ఒక వ్య‌క్తి స్పందించ‌గా.. మ‌రో యూజ‌ర్ గీజ‌ర్ కంపెనీల‌కు ఇది పెద్ద దెబ్బ అంటూ మ‌రో యూజ‌ర్ ఫ‌న్నీగా రాసుకొచ్చారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో న‌వ్వులు పూయిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories