గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లే ఎందుకు? 100 ఎందుకు కాదు?

Published : Nov 19, 2026, 11:26 AM IST

గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు ఎందుకు ఉండాలి? సమయాన్ని 100 నిమిషాలు లేదా 100 సెకండ్లుగా ఎందుకు విభజించలేదు? ఈ డౌట్ మీకు ఒక్కసారయినా వచ్చివుంటుంది. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
60 నిమిషాలు, 60 సెకండ్లు ఎందుకు?

మనం మామూలుగా చాలా లెక్కలకు 10, 100, 1000 సంఖ్యలనే వాడతాం. 100 శాతం, 100 మార్కులు, 100 కిలోలకు క్వింటాల్, 1000 కిలోలకు టన్ను… ఇలా వాడుతుంటాం. కానీ టైమ్ విషయంలో మాత్రం దీన్ని ఫాలోకాము…. గడియారంలో 12 గంటలు, రోజుకు 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకన్లు ఇలా ఉంటాయి. అన్ని విషయాల్లో మాదిరిగానే టైమ్ విషయంలోనూ 100 ను ప్రామాణికంగా ఎందుకు తీసుకోలేదు? 100 నిమిషాలకు ఓ గంట, వంద సెకన్లకు ఓ నిమిషం ఇలా ఎందుకు పరిగణించలేదు? నిమిషాలు, సెకన్లను 60 గానే ఎందుకు లెక్కిస్తారు?

25
4000 ఏళ్లనాటి టైమ్ చరిత్ర

చారిత్రకారుల అంచనా ప్రకారం… 60 ఆధారంగా సమయాన్ని లెక్కించే ఈ విధానం బబులోనియన్ల (నేటి ఇరాక్) నాగరికత నుంచి వచ్చింది. ప్రస్తుతం మనం పది అంకెల ఆధారంగా ఉన్న దశాంశ వ్యవస్థను (Decimal System) వాడుతున్నట్టే సుమారు 4000 ఏళ్ల కిందట బబులోనియన్లు 60 ఆధారంగా ఉన్న సంఖ్యా వ్యవస్థను (Sexagesimal) వాడేవాళ్లు.

బబులోనియన్లు 60 నెంబర్‌ను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం, దాన్ని సులువుగా చాలా సంఖ్యలతో భాగించవచ్చు. ఒక వస్తువును సగం, మూడో వంతు, పావు వంతు, ఐదో వంతుగా విభజించాలంటే 60 లెక్క బాగా ఉపయోగపడేది. అందుకే టైమ్ ను కూడా 60 తో లెక్కించినట్లు చెబుతారు.

35
గంటకు 60 నిమిషాల పద్ధతి ఎలా వచ్చింది?

అయితే సమయాన్ని గంటలు, నిమిషాలు, సెకండ్లుగా విభజించే ఈ పద్ధతి ఒకేసారి రాలేదు. ప్రాచీన ఈజిప్టులో పగలు, రాత్రిని చెరో 12 భాగాలుగా విభజించే పద్ధతి ఉండేది. దీని నుంచే 24 గంటల రోజు అనే కాన్సెప్ట్ పుట్టింది. ఆ తర్వాత బబులోనియన్ల 60 సంఖ్యా వ్యవస్థ దీనికి కలవడంతో సమయాన్ని లెక్కించే విధానం తయారైంది.

45
మరి గంటను 100 నిమిషాలుగా ఎందుకు చేయలేదు?

ప్రస్తుతం అన్ని లెక్కలకు 10ని ఆధారంగా వాడుతున్నా, గంటను 100 నిమిషాలుగా విభజించడం అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. కానీ 60ని నిమిషాలుగా విభజించడం ఈజీగా ఉండేది. ఒక గంటను సగం చేస్తే 30 నిమిషాలు, మూడు భాగాలు చేస్తే 20 నిమిషాలు, నాలుగు భాగాలు చేస్తే 15 నిమిషాలు వస్తాయి. 100 నిమిషాల పద్ధతిలో ఇలా సులువుగా భాగించడం కష్టంగా ఉండేది.

55
పాత గడియారాల్లో నిమిషాలు, సెకండ్లు కనిపించేవా?

ఇప్పటి గడియారాల్లో గంటలు, నిమిషాలు, సెకండ్లను సులువుగా చూడొచ్చు. కానీ ఒకప్పుడు అలా కాదు. ప్రారంభంలో వచ్చిన మెకానికల్ గడియారాల్లో గంటను చూపే ఒక ముల్లు మాత్రమే ఉండేది. 14వ శతాబ్దం సమయంలో యూరప్‌లో మెకానికల్ గడియారాల వాడకం మొదలైంది. ఆ తర్వాత 16వ శతాబ్దం నాటికి నిమిషాలు చూపే ముల్లు వాడకం పెరిగింది. ఆ తర్వాత కాలంలో సెకన్లను సూచించే ముళ్లు కూడా గడియారంలో యాడ్ అయ్యింది. ఇలా ఇప్పుడున్న మూడు ముల్లుల గడియారం తయారయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories