ఇండియాలో బెంగళూరు, హైదరాబాద్ లను ఐటీ సిటీస్ అంటారు... ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో, కాగ్నిజెంట్, జెన్ ప్యాక్ట్ ఈ నగరాల నుండే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక అమెరికాలో సిలికాన్ వ్యాలీ... ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్ బోర్న్... న్యూజిలాండ్ లో ఆక్లాండ్, వెల్లింగ్టన్... జర్మనీలో మ్యూనిచ్, బెర్లిన్ లను ఐటీ హబ్ అంటారు. అంటే ఈ నగరాలు ఐటీ రంగంలో అద్భుతాలు చేస్తున్నాయన్నమాట.
ఇలా ప్రపంచ దేశాల్లో అనేక నగరాలు ఐటీలో దూసుకుపోతున్నాయి... టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్నాయి. ఐటీ హబ్ గా మారిన నగరాలు వేగంగా డెవలప్ అవ్వడమే కాదు లక్షలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ఇండియాలో ఐటీ డెవలప్మెంట్ ను చూసినవారికి ఓ డౌట్ రావడం ఖాయం... దాయాది దేశం పాకిస్థాన్ లో ఐటీ సంగతేంటి? అక్కడ కూడా మనలా ఐటీ సిటీస్ ఉన్నాయా? ఉంటే అవి ఏ నగరాలు? అని.