Cyclone Arnab: తుపానులకు పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు?

Published : Oct 26, 2026, 06:31 PM IST

Cyclone Arnab: సైక్లోన్ అర్నబ్ తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి తుఫానులు గతంలో కూడా వచ్చాయి. ప్రతి తుఫానుకు ఒక పేరు ఉంటుంది. అసలు తుఫానులకు ఈ పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు?

PREV
13
తుఫానుకు పేరు ఎందుకు?

సముద్రాల్లో ఏర్పడే తుఫానులకు రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. తాజాగా తెలుగు రాష్ట్రాల తీరం దిశగా ‘అర్నబ్’ తుఫాను దూసుకొస్తుంది. ఇలా తుఫానులకు ఒక నిర్దిష్ట పేరు పెట్టడాతనికి ప్రధాన కారణం సమాచారాన్ని సులభంగా అందించేందుకే. తుఫాను అనే బదులు.. దానికి పేరుంటే ఆ తుపాను గురించి సులువుగా ప్రజలకు సమాచారం చెప్పవచ్చన్నది ముఖ్య ఉద్దేశం. ఒక పేరుంటే వాతావరణ హెచ్చరికలు జారీ చేయడానికి, మీడియా ప్రసారాలకు, సహాయక చర్యలు చేపట్టే విపత్తు నిర్వహణ బృందాలకు సమన్వయం సులభమవుతుంది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ తుఫానులు ఏర్పడినా గందరగోళం లేకుండా అప్రమత్తం చేయడానికి ఇలా పేరు పెట్టే విధానం ఉపయోగపడుతుంది.

23
తుపానులకు పేరు పెట్టేది ఎవరు?

తుపానులకు పెట్టే పేర్లను ఏ ఒక్కరో స్వతంత్రంగా నిర్ణయించరు. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఆధ్వర్యంలో ప్రాంతాలవారీగా ఏర్పాటైన కమిటీలు వీటిని నిర్ణయిస్తాయి. ఉత్తర హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడే తుఫానులకు పేర్లు పెట్టడానికి 13 తీరప్రాంత దేశాలు భాగస్వామ్యంగా ఉన్నాయి. అందులో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ ఉన్నాయి. ఈ 13 దేశాలు తలా 13 పేర్లను సూచించగా, మొత్తం 169 పేర్లతో ఒక అధికారిక జాబితాను ముందుగానే తయారు చేస్తారు. తుఫానులు ఏర్పడిన క్రమాన్ని బట్టి ఆ జాబితాలోని పేర్లను ఒకదాని తర్వాత ఒకటిగా కేటాయిస్తారు.

33
తుపానుకు అర్నబ్ పేరు ఎవరు పెట్టారు?

ఈ జాబితాలోని నియమాల ప్రకారం తాజా తుఫానుకు ‘అర్నబ్’ అనే పేరు ఖరారైంది. ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. బెంగాలీ భాషలో ‘అర్నబ్’ అంటే సముద్రం లేదా మహాసముద్రం అని అర్థం. తుఫానులకు పేర్లు ప్రతిపాదించేటప్పుడు అంతర్జాతీయ కమిటీ కొన్ని కఠినమైన నిబంధనలను పరిశీలిస్తుంది. పేరు చిన్నదిగా, పలకడానికి సులువుగా (గరిష్టంగా 8 అక్షరాలు) ఉండాలి. రాజకీయ, మత, సాంస్కృతిక, లింగపరమైన వివాదాలకు తావివ్వకూడదు. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయని పదాలనే ఎంపిక చేస్తారు. ఒకసారి ఉపయోగించిన పేరును తిరిగి ఉపయోగించరు.

Read more Photos on
click me!

Recommended Stories