Miss Universe 2026: ఎవరీ జెన్నిఫర్ బారెటో? ఆమె చెప్పిన ఆ ఒక్క సమాధానం చూస్తే షాక్ అవ్వాల్సిందే

Published : Nov 25, 2026, 01:02 PM IST

Miss Universe 2026: 75వ మిస్ యూనివర్స్ 2026 కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో గెలుచుకున్నారు. 116 మందితో పోటీపడి ఆమె సొంత గడ్డపై చరిత్ర సృష్టించారు. ఈ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
మిస్ యూనివర్స్ 2026: విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న ప్యూర్టోరికో బ్యూటీ.. రన్నరప్స్ ఎవరంటే?

ప్రతిష్ఠాత్మక 75వ మిస్ యూనివర్స్ 2026 కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది ఈ గ్రాండ్ ఫినాలే వేడుక ప్యూర్టోరికో రాజధాని శాన్ జువాన్‌లోని జోస్ మిగ్యుయెల్ అగ్రెలోట్ కొలీజియంలో అట్టహాసంగా జరిగింది. తన సొంత దేశంలో, సొంత ప్రజల సమక్షంలో జెన్నిఫర్ ఈ టైటిల్ గెలుచుకోవడం విశేషం. గత ఏడాది విజేత మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ జెన్నిఫర్‌కు కిరీటాన్ని ఆమెకు అందించారు.

25
ప్యూర్టోరికో చరిత్రలో ఆరో టైటిల్

ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లతో జెన్నిఫర్ బారెటో పోటీపడ్డారు. ఈ విజయంతో ప్యూర్టోరికో దేశం తరఫున మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఆరో మహిళగా జెన్నిఫర్ చరిత్ర సృష్టించారు. గతంలో ఆ దేశం ఐదుసార్లు ఈ కిరీటాన్ని దక్కించుకోగా, ఇప్పుడు జెన్నిఫర్ తన దేశ ఖాతాలో మరో ఘనతను చేర్చారు. 75వ ఎడిషన్ కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

35
ఎవరీ జెన్నిఫర్ బారెటో? చదువు, కెరీర్ వివరాలు ఇవే

జెన్నిఫర్ బారెటో కేవలం అందగత్తె మాత్రమే కాదు, మంచి విద్యావంతురాలు కూడా. ఆమెకు సైకాలజీ, సోషల్ వర్క్ విభాగాల్లో మంచి అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అంతేకాకుండా, ఆమె క్రైసిస్ ప్రివెన్షన్ విభాగంలో కెరీర్ కొనసాగిస్తున్నారు. సమాజ సేవ పట్ల ఉన్న మక్కువ, చదువు ద్వారా వచ్చిన అవగాహన ఆమె వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.

45
జడ్జీలను మెస్మరైజ్ చేసిన ఫైనల్ ఆన్సర్

పోటీలో భాగంగా జరిగిన చివరి రౌండ్‌లో జెన్నిఫర్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "ప్రస్తుత ప్రపంచానికి నాయకుల నుంచి అత్యంత అవసరమైనది ఏమిటి?" అని జడ్జీలు ఆమెను ప్రశ్నించారు. దీనికి జెన్నిఫర్ ఎంతో పరిణతితో సమాధానం ఇచ్చారు. ప్రపంచానికి ప్రొఫెషనల్‌గా సహానుభూతి కలిగిన నాయకులు కావాలని ఆమె చెప్పారు. నాయకులు తమ విలువలకు కట్టుబడి ఉండాలని, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజల మాట వినాలని ఆమె పేర్కొన్నారు. నాయకత్వం, సహానుభూతి, జవాబుదారీతనం గురించి ఆమె చెప్పిన మాటలు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించాయి.

55
టాప్ 5 విజేతలు, రన్నరప్స్ జాబితా ఇదే

116 మంది పోటీదారులతో జరిగిన ఈ 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో తుది విజేతల జాబితా ఇలా ఉంది..

• విజేత: జెన్నిఫర్ బారెటో (ప్యూర్టోరికో)

• మొదటి రన్నరప్: మెలిస్సా నూనెజ్ (డొమినికన్ రిపబ్లిక్)

• రెండో రన్నరప్: క్లారా వేగాస్ గోయెట్జ్ (వెనిజులా)

• నాలుగో స్థానం: బీ మిల్లన్-విండోర్స్కీ (ఫిలిప్పీన్స్)

• ఐదో స్థానం: జార్జియా వాడింగ్టన్ (న్యూజిలాండ్)

Read more Photos on
click me!

Recommended Stories