River : తెలంగాణలో అతిచిన్న నది ఏది? దాని పొడవు ఎంతో తెలుసా?

Published : Oct 29, 2026, 12:54 PM ISTUpdated : Oct 29, 2026, 01:12 PM IST

తెలంగాణ అతి తక్కువదూరం ప్రవహించేది అంటే అతిచిన్న నది ఏది? దీని పొడవు ఎంత? ఏఏ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
అతిచిన్న నది

తెలంగాణలో అతిపెద్ద నదులు ఏవంటే టక్కున గోదావరి, కృష్ణా పేర్లు వినిపిస్తాయి. ఈ రెండు నదులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తూ ముందుకు సాగి ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తాయి. ఇలా వేల కిలోమీటర్లు ప్రవహించే అతిపెద్ద నదుల గురించి అందరికీ తెలుసు... మరి తెలంగాణలో ప్రవహించే అతిచిన్న నది ఏది? అంటే చాలామంది చెప్పలేకపోవచ్చు. తెలంగాణలో అతితక్కువ దూరం ప్రవహించే టాప్ 3 చిన్న నదులేవో ఇక్కడ తెలుసుకుందాం.

24
145 కి.మీ మాత్రమే ప్రవహించే నది ఏది?

తెలంగాణలో ప్రవహించే ప్రధాన నదుల్లో పాలేరు నది ఒకటి. దీని పొడవు సుమారు 145 కిలోమీటర్లు... రాష్ట్రంలోని పెద్దపెద్ద నదులతో పోలిస్తే ఇది చాలా తక్కువ దూరం ప్రయాణిస్తుంది. వరంగల్ ప్రాంతంలో జన్మించే పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాలమీదుగా ప్రయాణం సాగిస్తుంది. చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముక్తేశ్వరపురం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. అంటే ఇది కృష్ణా నదికి ఉపనది అన్నమాట.

ఈ నది ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణలో పుట్టి మరో రాష్ట్రంలోని కృష్ణా నదీలో కలుస్తుంది... అంటే రెండు రాష్ట్రాలు, నాలుగైదు జిల్లాల మీదుగా ప్రవహించే ఇది అతిచిన్న నదిగా గుర్తింపు పొందింది. ఈ నది చిన్నదే అయినప్పటికీ తెలుగు ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తోంది.

34
తెలంగాణలో చిన్న నదులు

డిండి నది..

తెలంగాణలోనే పుట్టి రాష్ట్రంలోనే తన ప్రయాణాన్ని ముగించే నది డిండి... దీనిని దుందుభి నది అని కూడా పిలుస్తారు. ఈ నది మహబూబ్‌నగర్ ప్రాంతంలోని షాబాద్ కొండల్లో జన్మిస్తుంది. అక్కడి నుంచి ముందుకు సాగుతూ నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల ప్రాంతాల మీదుగా ప్రవహిస్తుంది.

డిండి నది సుమారు 153 కిలోమీటర్లు ప్రయాణించి నాగార్జునసాగర్ సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. పాలేరు నదితో పోలిస్తే డిండి పొడవు ఎక్కువైనా, గోదావరి, కృష్ణా వంటి ప్రధాన నదులతో పోలిస్తే ఇది చిన్న నదిగానే పరిగణించబడుతుంది.

మూసీ నది

తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నదుల్లో మూసీ నది ఒకటి. హైదరాబాద్ నగరం గుండా ప్రవహించడం వల్ల ఈ నది గురించి చాలామందికి తెలుసు. అయితే దీని పుట్టుక, ప్రవాహ మార్గం గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు.

మూసీ నది వికారాబాద్ జిల్లా పరిధిలోని అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది. అక్కడి నుంచి ముందుకు ప్రవహిస్తూ వివిధ ప్రాంతాల గుండా సాగుతుంది. ఈసీ, మూసా వంటి వాగులు, ఉపప్రవాహాలు కలవడంతో దీని జలప్రవాహం విస్తరిస్తుంది. అనంతరం హైదరాబాద్ నగరం గుండా ప్రవహించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.

మూసీ నది పొడవు సుమారు 256 కిలోమీటర్లు. పాలేరు, డిండి నదులతో పోలిస్తే ఇది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. హైదరాబాద్ నగర చరిత్ర, పట్టణ అభివృద్ధి, నీటి వనరుల చర్చల్లో మూసీ నదికి ప్రత్యేక స్థానం ఉంది.

44
పాలేరు, డిండి, మూసీ నదుల మధ్య తేడా ఏమిటి?

పాలేరు, డిండి, మూసి… ఈ మూడు నదుల పొడవు, పుట్టుక ప్రాంతాలు, ప్రవాహ మార్గాలను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి. పాలేరు సుమారు 145 కిలోమీటర్లు, డిండి సుమారు 153 కిలోమీటర్లు, మూసీ సుమారు 256 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ మూడు నదులూ చివరకు కృష్ణా నదీ వ్యవస్థలో కలుస్తాయి.

పాలేరు నది తెలంగాణలోని వరంగల్ ప్రాంతంలో పుట్టి ఆంధ్రప్రదేశ్‌లోని ముక్తేశ్వరపురం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. డిండి నది మహబూబ్‌నగర్ లో పుట్టి నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. మూసీ నది అనంతగిరి కొండల్లో జన్మించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories