India's Paris: మన దేశంలో ఏ నగరాన్ని ‘పారిస్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారో తెలుసా?

Published : Oct 06, 2026, 12:57 PM IST

India's Paris: చాలా మందికి పారిస్ వెళ్లాలి.. ఈఫిల్ టవర్ జీవితంలో ఒక్కసారైనా చూడాలి అనే కోరిక ఉంటుంది. కానీ, మన దేశంలోనూ ఓ మినీ పారిస్ ఉందని మీకు తెలుసా? అసలు ఏ నగరాన్ని పారిస్ తో పోలుస్తారు?

PREV
13
మినీ పారిస్..

పారిస్ అనగానే ముందుగా మన కళ్ల ముందు మెరిసేది ఈఫిల్ టవర్, అందమైన భవనాలు, విశాలమైన వీధులు. ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రాంతాల్లో పారిస్ ఒకటి. అయితే, పారిస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మన దేశంలోనే ఇవన్నీ చూడొచ్చు. మన దేశంలో ఒక నగరాన్ని ‘ పారిస్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు? ఆ నగరం మరేదో కాదు.. రాజస్థాన్ రాజధాని జైపూర్.

23
జైపూర్ కు ‘పారిస్ ఆఫ్ ఇండియా’ అనే పేరు ఎలా వచ్చింది..?

జైపూర్ ని పారిస్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. దీని ప్రధాన కారణం ఈ నగరం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ సిటీలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు భవనాలు కట్టుకోరు. దీనిని ఒక చక్కటి మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించారు. 18వ శతాబ్దంలో మహారాజా సవాయి జైసింగ్ II ఈ నగరానికి రూపకల్పన చేశారు. విశాలమైన రోడ్లు, ఒకదానికొకటి చక్కగా అనుసంధానమయ్యే వీధులు, సుందరమైన భవనాల అమరిక తో ఉంటుంది. అందుకే.. జైపూర్ చాలా అందంగా కనపడుతుంది.

జైపూర్ కి పింక్ సిటీ అని ఎందుకు పిలుస్తారు..?

ప్రపంచవ్యాప్తంగా జైపూర్‌ను “పింక్ సిటీ”గా పిలుస్తారు. 1876లో వేల్స్ యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ నగర పర్యటనకు వచ్చిన సందర్భంగా, అప్పట్లో ఈ నగరం మొత్తాన్ని గులాబీ రంగులో అలంకరించారు. అప్పటి నుంచి ఇలా పింక్ సిటీ అని పిలుస్తున్నారు. అయితే జైపూర్ అందం కేవలం రంగుకే పరిమితం కాదు. ఇక్కడ ఉన్న అద్భుత కట్టడాలు ఆ నగారానికి రాజసాన్ని తెచ్చిపెట్టాయి

33
జైపూర్ లో కచ్చితంగా చూడాల్సినవి...

హవా మహల్: జైపూర్ అనగానే టక్కున గుర్తువచ్చే పేరు ఇది. వందలాది చిన్న కిటికీలు, అద్భుతమైన జాలీ నిర్మాణంతో ఇది ఒక భారీ అలంకార ముఖభాగంలా కనిపిస్తుంది. అప్పట్లో రాజకుటుంబ మహిళలు వీధుల్లో జరిగే వేడుకలను బయటకు రాకుండా.. ఈ కిటికీల నుంచి చూసేవారు.

జైపూర్ కేవలం కోటలకే పరిమితం కాదు. ఇక్కడి పాత బజార్లలో రంగురంగుల రాజస్థానీ వస్త్రాలు, చేతితో తయారు చేసిన అపురూపమైన ఆభరణాలు, హస్తకళలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఘుమఘుమలాడే రాజస్థానీ వంటకాలు ఈ ట్రిప్‌ను మరింత మధురంగా మారుస్తాయి. అందుకే ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు.. భారతదేశపు చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్పం అన్నీ ఒకేచోట కళ్లకు కట్టి కనిపిస్తాయి. ఈ మినీ పారిస్ లో మనకు ఈఫిల్ టవర్ కనిపించదు. కానీ, ఈఫిల్ టవర్ పారిస్ కి ఎంత ఫేమసో... జైపూర్ కి హవా మహల్ అంత ఫేమస్.

Read more Photos on
click me!

Recommended Stories