Hummingbird : ప్రపంచంలో వెనక్కి ఎగరగల ఏకైక పక్షి ఇదే.. దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?

Published : May 20, 2026, 03:32 PM IST

Hummingbird : ప్రపంచంలో చాలా రకాలు పక్షులు ఉన్నాయి. కానీ, ఒక పక్షి మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ప్రపంచంలో వెనక్కి ఎగరగల ఏకైక పక్షి ఇదే. హెలికాప్టర్‌లా గాల్లోనే తేలియాడుతూ, రివర్స్‌ గేర్ వేసే ఈ బుజ్జి పిట్ట ఫ్లైట్ సీక్రెట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఒక్క సెకనుకు 80 సార్లు రెక్కల మూవ్‌మెంట్! ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన పక్షి ఇదే

ప్రపంచంలో దాదాపు 11,000 పక్షి జాతులు ఉన్నాయి. అందులో తొమ్మిది అడుగుల ఎత్తు, 330 పౌండ్ల బరువుండే భారీ నిప్పుకోడి (ఆస్ట్రిచ్) ఒకవైపు ఉంటే.. కేవలం ఒక రూపాయి కాయిన్ కంటే తక్కువ బరువుండే బుజ్జి ‘బీ హమ్మింగ్‌బర్డ్’ (Bee Hummingbird) మరోవైపు ఉంది. 

అయితే, ఈ పక్షులన్నింటిలోకి హమ్మింగ్‌బర్డ్‌కు మాత్రమే ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ పవర్ ఉంది. అదేంటంటే.. ఇది గాల్లో వెనక్కి ఎగరగలదు.. అవును, మీరు చదివింది నిజమే. పక్షుల ప్రపంచంలో రివర్స్ గేర్ వేయగల ఏకైక పక్షి హమ్మింగ్‌బర్డ్ మాత్రమే.

26
180 డిగ్రీలు తిరిగే షోల్డర్ జాయింట్

సాధారణంగా పక్షులు తమ రెక్కలను పైకి, కిందికి మాత్రమే ఆడిస్తాయి. కానీ హమ్మింగ్‌బర్డ్ బాడీ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని రెక్కల జాయింట్ ‘బాల్ అండ్ సాకెట్’ మెకానిజంతో పనిచేస్తుంది. దీనివల్ల ఇవి తమ రెక్కలను ఏకంగా 180 డిగ్రీల వరకు ఈజీగా రొటేట్ చేస్తాయి. 

ఈ విచిత్రమైన జాయింట్ వల్లే హమ్మింగ్‌బర్డ్స్ గాల్లో వెనక్కి మాత్రమే కాదు, అవసరమైతే తలకిందులుగా కూడా ఎగరగలవు. శత్రువుల నుంచి తప్పించుకోవాలన్నా, ఇరుకైన చోట్ల దూసుకెళ్లాలన్నా ఈ సూపర్ ఫ్లెక్సిబిలిటీ వీటికి బాగా హెల్ప్ అవుతుంది.

36
గాల్లో ఎయిట్ షేప్ మ్యాజిక్ చేసే బర్డ్ ఇది

హమ్మింగ్‌బర్డ్ ఎగిరేటప్పుడు దాని రెక్కలను గమనిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇవి తమ రెక్కలను గాల్లో నంబర్ 8 షేప్‌లో తిప్పుతాయి. ఇలా తిప్పడం వల్ల వీటికి రెక్కలు పైకి అనేటప్పుడు, కిందకు అనేటప్పుడు రెండింటిలోనూ లిఫ్ట్ పవర్ లభిస్తుంది. అందుకే ఇవి ఒకే చోట హెలికాప్టర్‌లా వుండగలవు.. అలాగే ఒక్క సెకనుకు 30 నుంచి 80 కంటే ఎక్కువ సార్లు రెక్కలను ఆడిస్తూ గాల్లో ఒక బ్లర్ లాగా కనిపిస్తాయి.

46
ఫ్లైట్ మజిల్స్ పవర్ హౌస్

ఈ చిన్న పక్షుల్లో ఉండే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పక్షుల ప్రపంచంలోనే బాడీ వెయిట్‌తో పోలిస్తే అత్యధిక ఫ్లైట్-మజిల్ రేషియో ఉన్నది హమ్మింగ్‌బర్డ్‌లకే. వీటి శరీర మొత్తం బరువులో 25% నుండి 30% వరకు కేవలం ఎగరడానికి ఉపయోగపడే కండరాలే ఉంటాయి. మిగతా పక్షులు కేవలం గాలి వాటాన్ని బట్టి కొద్దిసేపు వెనక్కి వెళ్లగలవేమో కానీ, హమ్మింగ్‌బర్డ్స్ మాత్రం తమ ఓన్ కంట్రోల్‌తో ఎటుపడితే అటు, ఎంతసేపైనా పర్ఫెక్ట్‌గా ఎగరగలవు.

56
రివర్స్ గేర్ ఎందుకు వేస్తాయంటే?

హమ్మింగ్‌బర్డ్‌లకు పూలలోని తియ్యని మకరందం అంటే అమితమైన ఇష్టం. ఎంతలా అంటే ఇవి ప్రతిరోజూ తమ శరీర బరువు కంటే 1 నుండి 3 రెట్లు ఎక్కువ మకరందాన్ని తాగుతాయి. అయితే, కొన్ని పూలు చాలా సన్నగా, పొడవుగా గొట్టంలా ఉంటాయి. వాటి లోపలికి దూరి జ్యూస్ తాగేసాక, బయటకు రావడానికి అక్కడ యూ-టర్న్ తీసుకునే ప్లేస్ ఉండదు. అందుకని ఇవి సింపుల్‌గా రివర్స్ గేర్ వేసి, వెనక్కి వచ్చేస్తాయి. అలాగే వేరే పక్షులు ఏవైనా వీటి ఫుడ్‌ని లాక్కోవడానికి వస్తే, కంటిరెప్ప మూసి తెరిచేలోపు వెనక్కి జరిగి ఎస్కేప్ అయిపోతాయి.

66
360కి పైగా జాతులు.. డేంజర్‌లో పాపులేషన్

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 360 నుండి 362 వరకు హమ్మింగ్‌బర్డ్ జాతులు ఉన్నాయి. ఇవి అమెరికా ఖండంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఉత్తరాన అలాస్కా, కెనడా నుండి దక్షిణాన టియెర్రా డెల్ ఫ్యూగో వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. ఇందులో అత్యంత చిన్నదైన బీ హమ్మింగ్‌బర్డ్ 1.6 నుండి 1.9 గ్రాముల బరువుంటే, జెయింట్ హమ్మింగ్‌బర్డ్ 20 నుండి 24 గ్రాముల బరువుంటుంది. అయితే, ప్రస్తుతం వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల డజన్ల కొద్దీ హమ్మింగ్‌బర్డ్ జాతులు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి.

Read more Photos on
click me!

Recommended Stories