Sun disappearance: సూర్యుడు హఠాత్తుగా మాయమైపోతే మనుషులు ఎన్నాళ్లు బతకగలరు? ఏ దేశం సూర్యుడు లేకున్నా సేఫ్?

Published : May 20, 2026, 10:23 AM IST

Sun disappearance: ప్రాణకోటికి జీవనాధారం నీరు. ఆ తర్వాతి స్థానం సూర్యుడిదే. ఒక్కసారిగా సూర్యుడు మాయమైతే ఏమవుతుంది? ఇలా జరగకపోవచ్చు కానీ శాస్త్రవేత్తలు ఈ ఊహాత్మక పరిస్థితి పై అధ్యయనం చేసి ఏం జరుగుతుందో వివరించారు. 

PREV
14
సూర్యుడు అదృశ్యమైపోతే..

సూర్యుడు ఆకాశంలో పూర్తిగా అదృశ్యం అయిపోతే మనుషులు ఎంత కాలం బతకగలరు? భూమి ఎంత కాలం మనుగడ సాగించగలదు? ఏ దేశంలోని ప్రజలు సేఫ్ గా ఉంటారు? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో అధ్యయనాలు చేశారు. ఆ అధ్యయనాల వివరాలను ఇప్పుడు బయట పెట్టారు. సూర్యుడు ఒక్కసారిగా కనుమరుగైతే మొదటి ఎనిమిది నిమిషాల వరకు భూమిపై ఎలాంటి మార్పు కనిపించదు. ఎందుకంటే సూర్యకాంతి భూమికి చేరేందుకు ఎనిమిది నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతుంది. ఆకాశంలో చంద్రుడు, గ్రహాలు ఏవీ కనిపించవు. ఇక విద్యుత్ పై ఆధారపడే మనుషుల జీవితం అల్లకల్లోలం అయిపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

24
భూమిపై ఏం జరుగుతుంది?

సూర్యుడు లేకపోతే కేవలం వెలుతురు మాత్రమే రాదు కదా అనుకోవచ్చు.. కానీ భూమికి అవసరమైన వేడి కూడా అందేది సూర్యుడి నుంచే. అలాంటి సూర్యుడు మాయమైపోతే మొదటి కొన్ని రోజుల్లోనే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతాయి. సరస్సులు, నదులు గడ్డకడతాయి. తాడానికి నీరు కూడా దొరకదు. భూమి ఉపరితలం తీవ్రచలితో మంచుగా మారిపోతుంది. మొక్కలు చనిపోవడం మొదలుపడతాయి. ఇక మొక్కలపైన ఆధారపడిన జంతువులు కూడా జీవించలేవు. ఆహార వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సముద్రాల పై భాగం కూడా గడ్డ కడుతుంది. భూమి తీవ్ర చలికి లోనవ్వడం వల్ల మనుషులు జీవించలేరు. కేవలం 20 రోజులు వరకు వారు సూర్యుడు లేకుండా జీవించే అవకాశం ఉంది.

34
మనుషులు బతకగలరా?

ఇక సూర్యుడు మాయమైతే వచ్చే అతి పెద్ద సమస్య గురుత్వాకర్షణ. సూర్యుడి గురుత్వాకర్షణ వల్లే భూమి తన కక్ష్యలో తాను తిరుగుతోంది. అదే సూర్యుడే లేకుంటే భూమి తన కక్ష్యను వదిలి నేరుగా అంతరిక్షంలోకి ప్రయాణం మొదలు పెడుతుంది. అంటే భూమి ఇకపై ఏ నక్షత్రం చుట్టూ తిరగకుండా.. చీకట్లో అంతరిక్షంలో తేలుతూ ఉంటుంది. దీనివల్ల భూమిపై మనుషులు బతకలేరు. కొన్ని సూక్ష్మజీవులు మాత్రం కొంతకాలం బతికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్ర గర్భంలోని బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు తీవ్ర పరిస్థితుల్లో కూడా జీవించగలవు.

44
ఏ దేశం సేఫ్?

ప్రపంచంలోనే అన్ని దేశాల్లోని మనుషులు 20 నుంచి 30 రోజుల్లో అంతరించి పోతారు. కానీ ఐస్లాండ్ వంటి మంచు దేశాల్లో మాత్రం ప్రజలు ఎక్కువ రోజులు బతకగలరు. భూగర్భ ఉష్ణ శక్తి ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటున్న దేశం అది. ఉంది సూర్యుడు కనుమరుగైపోయిన అక్కడ నివసించే ప్రజలు కొద్ది కాలం పాటు విద్యుత్తును, వేడిని సమకూర్చుకోగలరు. జలాంతర్గములలో, భూగర్భ ఆశ్రయాలలో అక్కడి మానవుల కొద్ది కాలం పాటు జీవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే ఇదంతా చదివాక సూర్యుడు అదృశ్యం అయిపోతాడేమోనని భయం పెట్టుకోవద్దు. సూర్యుడు కాంతినిచ్చే నక్షత్రమే కాదు భూమిపై జీవానికి ప్రధాన ఆధారం. సూర్యుడు లేకపోతే వేడి ఉండదు, ఆహారం ఉండదు, సాధారణమైన జీవితం ఉండదు. అయితే సూర్యుడు అంత ఆకస్మికంగా మాయమవ్వడం అనేది జరగడం అసాధ్యం. కాబట్టి నిశ్చింతగా ఉండండి.

Read more Photos on
click me!

Recommended Stories