First Night Milk: పెళ్లయిన మొదటి రాత్రికి, పాలకు ఏమిటి సంబంధం?

Published : Jan 13, 2026, 09:03 AM IST

First Night Milk: భారతీయ వివాహ సంప్రదాయంలో పెళ్లైన మొదటి రాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ రోజు వధూవరులకి పాలు తాగించడం ఒక ఆచారం. ఆ శోభనం రాత్రికి పాలకు ఏమిటి సంబంధం? 

PREV
14
మొదటిరాత్రి పాలు ఎందుకు?

భారతదేశంలో వివాహ సంప్రదాయాలు అధికంగా ఉంటాయి. వివాహం జరిగిన రాత్రి లేదా శోభనం రాత్రి వధూవరులకు పాలు తాగించడం అనేది చాలా కాలంగా వస్తున్న ఆచారం. పెళ్లి పూర్తి అయిన తర్వాత కొత్త దంపతులకు పెద్దలు ఒక గ్లాసు పాలను అందిస్తారు. కొంతమంది అందులో కుంకుమపువ్వు, పంచదార, బాదం పౌడర్ వంటివి కూడా కలుపుతారు. పెళ్లయిన మొదటి రాత్రికి, పాలకు అనుబంధం ఏమిటి? ఆ రాత్రి పాలను ఇద్దరు దంపతులు ఎందుకు తాగాలి?

24
అప్పట్లో ఆ డ్రింక్స్ లేవు

ఈ సంప్రదాయం వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం కూడా దాగి ఉంది. పెళ్లి అనేది ఒక రోజు జరిగిపోయే తంతుకాదు.. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచి ఏర్పాట్ల కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ప్రయాణాలు చేస్తూ తీవ్రంగా అలసిపోతారు. సరిగా నిద్రపోయేందుకు కూడా సమయం దొరకదు. ఈ సమయంలో శరీరం బలహీనంగా మారిపోతుంది. అందుకే పెళ్లి ముగిసిన తర్వాత మొదటి రాత్రి పాలు వంటి పోషకాహారంతో వారి జీవితం మొదలయ్యేలా చూస్తారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని నమ్ముతారు. పూర్వం ఎనర్జీ డ్రింక్స్ వంటివి ఉండేవి కాదు. పాలు శక్తినిచ్చే పానీయంగా భావించేవారు. అందుకోసమే కొత్తగా పెళ్లి అయిన దంపతులకు మొదట రాత్రి పాల గ్లాసుని ఇచ్చి పంపడం అలవాటుగా మార్చారు. అదే ఇప్పుడు సంప్రదాయంగా మారిపోయింది.

34
సైన్స్ ఏం చెబుతోంది?

ఇక సైన్స్ పరంగా చూస్తే పాలు నిజంగానే పోషక విలువలు కలిగిన ఆహారం. పాలల్లో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వివాహం జరిగిన రాత్రి పాలు తాగించడం వల్ల నూతన వధూవరులకు శారీరక శక్తి పెరుగుతుంది. దాంపత్య జీవితం మొదలుపెట్టడానికి శారీరక శక్తి కూడా చాలా అవసరం. ఆ విధంగా కూడా శోభనం రోజు రాత్రి పాలు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా మారిందని చెప్పుకోవచ్చు.

44
చెరో సగం పాలకు ఇదే అర్థం

అయితే వివాహం జరిగిన తర్వాత మొదటి రాత్రి పాలు తాగించడం అనేది ఒక సాంప్రదాయంగానే అందరూ చూస్తున్నారు. ఎంతోమంది ఆచారాన్ని కచ్చితంగా పాటించాలని ఒత్తిడితో ఉంటున్నారు. నిజానికి దంపతులు ఆరోగ్యం, సౌకర్యం, ఇష్టాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. పాలు తాగాలనిపిస్తే తాగవచ్చు.. లేకపోతే వేరే పానీయం ఏదైనా తీసుకోవచ్చు. కొత్త జీవితాన్ని పరస్పర ప్రేమతో గౌరవంతో, అర్థం చేసుకునే స్వభావంతో ప్రారంభించాలి. పాలతోనే ప్రారంభించాలనే నియమం ఎక్కడా లేదు. గ్లాసు పాలు ఇద్దరు దంపతులకు ఇచ్చి చెరో సగం తాగమని చెబుతారు. ఇది జీవితంలో వచ్చే కష్టసుఖాలను కూడా ఇద్దరూ చెరో సగం పంచుకోవాలన్నదే దీని సారాంశం. అంతే తప్ప శోభనం రోజు రాత్రి పాలు తాగకపోతే పెద్ద పొరపాటు చేసినట్టే అనే ఉద్దేశం ఏమీ లేదు. నచ్చకపోతే తాగడం మానయవచ్చు కూడా.

Read more Photos on
click me!

Recommended Stories