Aeroplane: ఆకాశంలో వెళుతున్న విమానంపై అకస్మాత్తుగా పిడుగు పడితే ఏం జరుగుతుంది?

Published : Jun 22, 2026, 10:50 AM IST

Aeroplane: విమానాలు నిత్యం ఆకాశంలో తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఆకాశంలో పిడుగులు కూడా కనిపిస్తూనే ఉంటాయి. అయితే విమానంపై పిడుగు పడితే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా? 

PREV
13
విమానం పై పిడుగు పడితే?

వేల అడుగుల ఎత్తులో ఆకాశంలో ఎగురుతున్న విమానం పై పిడుగు పడటం అనేది ఊహకే భయంకరంగా అనిపిస్తుంది. వర్షం సమయంలో మెరుపులు, ఉరుములు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు విమానం పై పిడుగు పడితే ప్రయాణికులు ఏమైపోతారో అన్న ఆందోళన ఎక్కువ మందిలో ఉంటుంది. అయితే ఎగురుతున్న విమానంపై పిడుగు పడితే ఏం జరుగుతుందో తెలిసినవారు చాలా తక్కువ. ఆధునిక విమానాలు పిడుగులను, ఉరుములను తట్టుకునేలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. నిజానికి ఒక విమానం పై ఏడాదికి ఒకటి రెండు సార్లు అయినా పిడుగు పడే అవకాశం ఉంటుంది. కానీ దాని ప్రభావం విమానంలో ఉన్న వారిపై పెద్దగా కనిపించదు.

23
పైలెట్లు ఏం చేస్తారు?

విమానం పై పిడుగు పడినప్పుడు విద్యుత్ ప్రవాహం బయట ఉన్న ఉపరితలం మీదుగానే ప్రయాణించి పక్కకు వెళ్ళిపోతుంది. దీన్ని ఫారడే కేజ్ అని అంటారు. విమానం మొత్తం లోహంతో తయారై ఉంటుంది. విద్యుత్ లోపలికి వెళ్ళకుండా బయట నుంచి అడ్డుకుంటుంది. ప్రయాణికులు, లోపల ఉన్న సిబ్బంది సురక్షితంగానే ఉంటారు. అయితే పిడుగు తాకినప్పుడు మాత్రం పెద్ద శబ్దం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విమానం ఒక్కసారిగా కుదుపుకు గురైనట్లు పెద్ద వెలుగు కనిపించడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు పైలెట్లు విమానాన్ని సురక్షితంగా నియంత్రిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

33
జరిగే నష్టాలు ఇవే

అయితే పిడుగు పడటం వల్ల విమానానికి ఎలాంటి ప్రభావం ఉండదని పూర్తిగా చెప్పలేం. కొన్ని సందర్భాల్లో విమానం రెక్కలు విరిగిపోవచ్చు లేదా ముక్కు భాగం లో మంటలు అంటుకోవచ్చు. ఒక్కొక్కసారి నావిగేషన్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలపై కూడా ప్రభావం చూపించవచ్చు. అప్పుడు అవి పని చేయకుండా ఆగిపోవచ్చు. అయితే పిడుగు తగిలిన తర్వాత విమానం గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే ఇంజనీర్లు విమానం మొత్తాన్ని పరిశీలిస్తారు. ఎక్కడైతే తీవ్రమైన నష్టం జరుగుతుందో దానికి మరమ్మతులు చేస్తారు. కాబట్టి ప్రయాణికులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని విమానయాన నిపుణులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులను ముందుగానే రాడార్ వ్యవస్థలు గుర్తిస్తాయి. విమానం ప్రయాణిస్తున్న మార్గంలో వాతావరణం ఎలా ఉందో అంచనా వేసే చెబుతాయి. భారీ తుపానులు ఉన్నచోట పైలెట్లు ఆ మార్గాన్ని తప్పించే ప్రయత్నం చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా విమానాల్లో అనేక భద్రత వ్యవస్థలే పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఎన్నో విమానాలు ప్రతిరోజు వర్షాలు మేఘాలు, పిడుగులు, ఉరుములు మధ్య కూడా తమ ప్రయాణాన్ని పూర్తిచేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories