రైలు బ్రేకులు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంతో తెలుసా? ట్రైన్ బ్రేకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది

Published : Nov 25, 2026, 01:41 PM IST

కార్లు, బస్సులు, బైక్ లు బ్రేక్ పడకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలుసు? మరి రైలు బ్రేకులు ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అసలు ట్రైన్ బ్రేక్ వ్యవస్థ ఎలా ఉంటుంది? ఎలా పనిచేస్తుందో తెలుసా?

PREV
13
రైలు బ్రేకులు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలుకు ముందు రెడ్ సిగ్నల్ పడినప్పుడు, లోకో పైలట్ బ్రేక్ వేసినా బ్రేక్ పడకపోతే ఏం జరుగుతుందనే సందేహం సహజంగానే కలుగుతుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, రైలు బ్రేకుల్లో సమస్య వస్తే అది పరిగెత్తదు. తనంతట తానే ఆగిపోయేలా దీన్ని డిజైన్ చేశారు. రైలు బ్రేకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, బ్రేకులు పోయిన ఘటనలు ఏం చెబుతాయి తెలుసుకుందాం?

23
'తలకిందుల' ఎయిర్ బ్రేక్ వ్యవస్థ

ఎయిర్ బ్రేక్ రాకముందు ప్రతి భోగి మీద హ్యాండ్ బ్రేక్ ఉండేది... పైలట్ విజిల్ వేయగానే బ్రేక్‌మెన్ అనే సిబ్బంది కదులుతున్న రైలు పైకప్పులపై ఒక భోగి నుంచి ఇంకో భోగికి దూకుతూ చక్రాలను చేత్తో తిప్పేవారు. ఈ పనిలో జారిపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 1869లో జార్జ్ వెస్టింగ్‌హౌస్ ఎయిర్ బ్రేక్‌కు పేటెంట్ తీసుకున్నప్పుడు మొదట పైపు పగిలితే బ్రేకులు పడని లోపం ఉండేది, తర్వాత దాన్ని రివర్స్ చేశారు.

కారు లేదా బైక్‌కు భిన్నంగా, రైలు బ్రేక్ పైప్‌లో రైలు నడుస్తున్నంత సేపు దాదాపు 5 కేజీల ప్రెషర్‌తో గాలి ఉండి బ్రేకులను వెనక్కి పట్టుకుంటుంది. ఇంజిన్‌లోని కంప్రెసర్ గాలిని కంప్రెస్ చేసి మెయిన్ రిజర్వాయర్‌లో నింపుతుంది, అలాగే ఫీడ్ పైప్ ద్వారా సుమారు 6 కేజీల ప్రెషర్‌తో భోగల కింద ట్యాంకులను నింపుతుంది. పైలట్ బ్రేక్ వేయడానికి గాలిని కొంచెం వదిలినప్పుడు ప్రెషర్ తగ్గి బ్రేక్ సిలిండర్‌లోకి గాలి వెళ్లి బ్రేక్ పడుతుంది. పైపు పగిలినా, కప్లింగ్ తెగినా గాలి ఒక్కసారిగా పోయి ఎమర్జెన్సీ బ్రేక్ పడుతుంది; దీన్నే ఫెయిల్ సేఫ్ డిజైన్ అంటారు. అలారం చైన్ లాగినా, గార్డ్ వద్ద వాల్వ్ తెరిచినా ఇలాగే బ్రేక్ పడుతుంది.

33
కవచ్, ఆధునిక బ్రేకులు, క్యాచ్ సైడింగ్‌లు

పైలట్ స్పందించకపోతే ఆటోమేటిక్‌గా బ్రేక్ వేసే విజిలెన్స్ కంట్రోల్ డివైస్ ఇంజిన్‌లో ఉంటుంది. కొత్త కవచ్ వ్యవస్థ రెడ్ సిగ్నల్ వద్ద లేదా వేగ పరిమితి దాటినప్పుడు తనంతట తానే బ్రేక్ వేస్తుంది; ఒక ట్రయల్‌లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు రెడ్ సిగ్నల్‌కు 50 మీటర్ల ముందే ఆగిపోయింది (2030 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యం). ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో డిస్క్ బ్రేకులు ఉంటాయి, కొత్త ఎలక్ట్రిక్ ఇంజిన్లలో రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా విద్యుత్ తిరిగి వైర్‌లోకి వెళ్తుంది (ముంబై లోకల్ రైళ్లలో ఏటా దాదాపు 15 కోట్ల యూనిట్ల కరెంట్ ఆదా అవుతోంది). బోర్ ఘాట్, తల్ఘాట్ వంటి ఘాట్ సెక్షన్లలో నియంత్రణ తప్పిన రైళ్లను ఆపడానికి కొండ వైపు ఏటవాలుగా ఎక్కే క్యాచ్ సైడింగ్‌లు కట్టారు.

గుర్తుంచుకోవాల్సిన నిజం

2013 లో లాక్ మెగాంటిక్ కెనడాలో ఏం జరిగిందంటే.. వాలు మీద నిలిపిన క్రూడ్ ఆయిల్ గూడ్స్ రైలుకు ఏడు హ్యాండ్ బ్రేకులు వేయగా, ఇంజిన్ బ్రేక్ కూడా ఆన్‌లో ఉంది. రాత్రి ఇంజిన్‌లో మంట రావడంతో దాన్ని ఆపేశారు; కంప్రెసర్ ఆగి గాలి చిన్న లీక్‌ల ద్వారా నెమ్మదిగా పోవడంతో ఇంజిన్ బ్రేక్ పట్టు వదిలేసింది. చివరికి ఏడు హ్యాండ్ బ్రేకులు బరువును ఆపలేక రైలు జారి పట్టాలు తప్పి 47 మంది మరణించారు (ఇంజిన్ బ్రేక్ లేకుండా ఆపడానికి కనీసం 17 హ్యాండ్ బ్రేకులు అవసరమని తేలింది).

జమ్మూ కశ్మీర్‌లోని కథువా స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే వాలులో కదిలి పంజాబ్ వైపు సుమారు 70 కిలోమీటర్లు వెళ్లి, హోషియార్పూర్ వద్ద చెక్క దిమ్మెలతో ఆగింది; ఎవరికీ ప్రమాదం జరగలేదు. గాలి సడన్ గా పోతే రైలు ఆగుతుంది, కానీ నెమ్మదిగా పోతే లేదా లాకింగ్/మానవ పొరపాట్లు జరిగితే ప్రమాదాలు వస్తాయి. వేగం రెట్టింపు అయితే ఆగడానికి కావాల్సిన దూరం నాలుగు రెట్లు పెరుగుతుంది కాబట్టి రైలు వస్తున్నప్పుడు గేట్ దాటేటప్పుడు ఎప్పుడూ తొందరపడకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories